Best Tyre Brand in India: ఇవి దేశంలోని అత్యంత శక్తివంతమైన టైర్లు.. ప్రభుత్వం నుండి 5 స్టార్ రేటింగ్!
Best Tyre Brand in India: ఏ వాహనానికైనా టైర్లు అనేది ముఖ్యమైనవి. కారు టైర్లు చెడిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. టైర్లు బాగా లేకుంటే ఇంజిన్‌పై చాలా ఒత్తిడిని ఉంటుంది..
Best Tyre Brand in India: ఏ వాహనానికైనా టైర్లు అనేది ముఖ్యమైనవి. కారు టైర్లు చెడిపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. టైర్లు బాగా లేకుంటే ఇంజిన్‌పై చాలా ఒత్తిడిని ఉంటుంది. ఇది ఇంధన వినియోగాన్ని పెంచడమే కాకుండా, వాహనం పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అందువల్ల రహదారి భద్రత, ఇంధన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం టైర్లకు స్టార్ రేటింగ్‌లు ఇవ్వడం ప్రారంభించింది. మిచెలిన్ టైర్ (Michelin Tyres)లకు 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్న భారతదేశంలో మొదటి బ్రాండ్‌గా అవతరించింది. దేశంలోనే తొలిసారిగా టైర్‌కు 5 స్టార్ రేటింగ్ లభించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ రేటింగ్‌ను మిచెలిన్ టైర్స్‌కు జారీ చేసింది.
మిచెలిన్ 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి టైర్ బ్రాండ్
ఫ్రెంచ్ టైర్ బ్రాండ్ మిచెలిన్ భారతదేశంలో 5 స్టార్ రేటింగ్ సాధించిన మొదటి టైర్ బ్రాండ్. దీని కోసం, కంపెనీ తన మూడవ తరం లాటిట్యూడ్ స్పోర్ట్ 3, పైలట్ స్పోర్ట్ 4 SUV టైర్‌లను ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సెట్ చేసిన నిబంధనల ప్రకారం పరీక్షించింది. ఈ రెండు టైర్లు 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. మిచెలిన్ వాణిజ్య టైర్లు భారతదేశంలో 4-స్టార్ రేటింగ్ పొందిన మొదటి టైర్లు.
భారత ప్రభుత్వం కొత్త నియమం
భారత ప్రభుత్వం కొత్త నియమం ప్రకారం.. అక్టోబర్ 2022 నుండి దేశంలో విక్రయించే అన్ని ప్యాసింజర్ కార్ టైర్లు నిర్ణీత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఇందుకోసం ఆటోమేటెడ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (ఏఐఎస్) కొత్త నిబంధనలను రూపొందించింది. అందువల్ల దేశీయ టైర్ తయారీదారులతో సహా విదేశీ టైర్ తయారీదారులు కూడా BEE స్టార్ లేబుల్‌ను కలిగి ఉండాలి.
5 స్టార్ రేటెడ్ టైర్ ఇంధనాన్ని ఆదా చేస్తుంది
5 స్టార్ రేటెడ్ టైర్లను ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం 9.5 శాతం వరకు తగ్గుతుందని AIS పేర్కొంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి. 5 స్టార్ రేటింగ్ టైర్‌లకు మారడం వల్ల సగటున 750 కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. రహదారి భద్రత, పనితీరు పెరుగుతుంది. 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉన్న టైర్లు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, వినియోగదారుల భద్రత కూడా పెరుగుతుంది. కానీ ఇంధన ధరలు ఎక్కువగా ఉన్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ టైర్లు వినియోగదారుల పొదుపును కూడా పెంచుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి