HMDA Online Auction: తొలిరోజు తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ.. హాట్‌ కేకుల్లా ఆన్‌లైన్‌ వేలం

గ్రేటర్‌ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం వేసేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.

HMDA Online Auction: తొలిరోజు తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటా పోటీ.. హాట్‌ కేకుల్లా ఆన్‌లైన్‌ వేలం
Online Auction
Jyothi Gadda

|

Jul 01, 2022 | 8:24 PM

గ్రేటర్‌ చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో మూడు చోట్ల ఉన్న ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలం వేసేందుకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాట్ల వేలం పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​మండలం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) రూపొందించిన ‘‘తొర్రూర్​ లే అవుట్’’​ లో ప్లాట్లు హాట్​ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రెండో దఫా 140 ప్లాట్లను వరుసగా మూడు రోజుల పాటు ఆన్​ లైన్​ వేలం ద్వారా హెచ్ఎండిఏ విక్రయించనుంది.

ఆన్​ లైన్​ వేలం ప్రక్రియలో భాగంగా శుక్రవారం రెండు సెషన్లలో 42 ప్లాట్ల కు జరిగిన ఆన్​ లైన్​ వేలంలో 41 ప్లాట్ల కొనుగోలుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. మార్నింగ్​ సెషన్​లో అత్యధికంగా గజం రూ.33,000లు ధరకు పలుకగా, అత్యల్పంగా గజం రూ.23,000లు పలికింది. ఈవినింగ్​ సెషన్​ లో అత్యధికంగా గజం రూ.35,500లు బిడ్​ చేయగా, అత్యల్పంగా గజం రూ.21,000లకు ధర పలికింది. శుక్రవారం రూ.33.58 కోట్ల విలువజేసే 41 ప్లాట్లు ఆన్​ లైన్​ వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి. మిగతా 106 ప్లాట్ల కు శనివారం, తిరిగి సోమవారం ఆన్​ లైన్​ వేలం ద్వారా బిడ్డింగ్​జరుగనున్నది.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ మూడు చోట్ల ఉన్న లే అవుట్లలోని ప్లాట్లను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనుంది. తుర్క యాంజాల్‌లో సుమారు 9.5 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్న లే అవుట్‌లో 34 ప్లాట్లు, బహదూర్‌పల్లిలోని 51 ప్లాట్లకు జూన్‌ 30వ తేదీన, అదే విధంగా జూలై 1,2,4 తేదీల్లో తొర్రూర్‌లోని 148 ప్లాట్లకు ఆన్‌లైన్‌ వేలం వేయనున్నారు. మొత్తం 233 ప్లాట్లకు ఆన్‌లైన్‌లోనే వేలం నిర్వహించనున్నారు. గతంలో ఉప్పల్‌ భగాయత్‌లో హెచ్‌ఎండీఏ చేపట్టిన తరహాలోనే పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తూ లే అవుట్లను అభివృద్ధి చేయనున్నారు. తుర్క యాంజాల్‌లో చరదపు గజానికి రూ.40 వేలు, బహదూర్‌పల్లి లే అవుట్‌లో చదరపు గజానికి నిర్ధారించిన కనీస ధరను రూ.25,0000లుగా, తొర్రూర్‌లో చదరపు గజానికి రూ.20000లుగా నిర్ణయించారు. చదరపు గజానికి కనీస బిడ్‌ పెంపుదలను రూ.500ల చొప్పున పెంచాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu