Hyderabad: హైదరాబాద్ లో ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం.. పోలీసులకు బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు
హైదరాబాద్ (Hyderabad) మహానగర రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల హోర్డింగ్ లు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనతో హైదరాబాద్‌లో...
హైదరాబాద్ (Hyderabad) మహానగర రహదారులు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా రాజకీయ పార్టీల హోర్డింగ్ లు, బ్యానర్లు కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలు, రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటనతో హైదరాబాద్‌లో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం నెలకొంది. తమవి తొలగిస్తున్నారంటే.. తమవి తొలగిస్తున్నారంటూ పరస్పరం పోలీసులకు కంప్లైంట్ చేసుకున్నారు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ బీజేపీ, టీఆర్ఎస్ జెండాలు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ పార్టీల జెండాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. కాగా.. యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు చింపేస్తున్నారంటూ ప్రభుత్వ చీఫ్‌విప్ బాల్క సుమన్ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఓఆర్‌ఆర్‌పై తమ ఫ్లెక్సీలను చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ పర్యటన ఖరారైంది. శనివారం హైదరాబాద్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. శనివారం, ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగే సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శుక్రవారం నుంచి 4వ తేదీ వరకు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న మోదీకి మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో 28 నుంచి 30 గంటల పాటు గడపనున్న ప్రధాని పర్యటనను.. విజయవంతంగా పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి