BJP National Executive Meet: గోల్కొండ ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన జేపీ నడ్డా.. బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. అక్కడ గొల్లకొండ ఎగ్జిబిషన్‌ ప్రారంభించి.. అందులో ఉన్న ఫోటోలను పరిశీలించారు. తెలంగాణ అమరవీరులతో పాటు పలువురు ముఖ్య నేతల పోటోలు, హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఫోటోలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. కాసేపట్లో బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై.. కార్యవర్గ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్నారు. అంతకుముందు శంషాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు. దారి పొడవునా పార్టీ జాతీయ అధ్యక్షుడికి బీజేపీ శ్రేణులు ఘన […]

BJP National Executive Meet: గోల్కొండ ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన జేపీ నడ్డా.. బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం
Jd Nadda
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 01, 2022 | 10:45 PM

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. అక్కడ గొల్లకొండ ఎగ్జిబిషన్‌ ప్రారంభించి.. అందులో ఉన్న ఫోటోలను పరిశీలించారు. తెలంగాణ అమరవీరులతో పాటు పలువురు ముఖ్య నేతల పోటోలు, హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఫోటోలను ఎగ్జిబిషన్‌లో ఉంచారు. కాసేపట్లో బీజేపీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై.. కార్యవర్గ సమావేశాల ఎజెండా ఖరారు చేయనున్నారు. అంతకుముందు శంషాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు. దారి పొడవునా పార్టీ జాతీయ అధ్యక్షుడికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ నడ్డా ముందుకు సాగారు.

తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు, ఆదిలాబాద్‌ గుస్సాడి నృత్యం, లంబాడీ నృత్యాలు, కోలాటాలు, డప్పు, డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు బీజేపీ నేతలు.

తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అందుకే ఈ సర్కార్‌ను దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

తెలంగాణ వార్తల కోసం