Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: మీకు చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం వచ్చా..? అయితే పుష్ప సినిమాలో నటించే అవకాశం మీదే..

మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా...! అయితే 'పుష్ప ది రూల్' సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! అవును ! పుష్ప ఫస్ట్ (Pushpa) పార్ట్ ది రైజ్‌ సూపర్ డూపర్ హిట్టు తరువాత పుష్ప ది రూల్ పై ఫోకస్...

Pushpa: మీకు చిత్తూరు స్లాంగ్ మాట్లాడటం వచ్చా..? అయితే పుష్ప సినిమాలో నటించే అవకాశం మీదే..
Pushpa The Rule
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 01, 2022 | 5:24 PM

మీకు తెలుగు మాట్లాడడం వచ్చా.. అందులోనూ చిత్తూరు యాసలో అదరగొట్టగలరా…! అయితే ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటించే అవకాశం మీకు కూడా రావచ్చు! అవును ! పుష్ప ఫస్ట్ (Pushpa) పార్ట్ ది రైజ్‌ సూపర్ డూపర్ హిట్టు తరువాత పుష్ప ది రూల్ పై ఫోకస్ పెట్టారు డైరెక్టర్ సుకుమార్. ఫస్ట్ పార్ట్ ను మించేలా.. భారీ కాస్ట్‌తో ఈ సినిమాను పిక్చరైజ్‌ చేయాలనుకుంటున్నారు. అందులోనూ రియలెస్టిక్‌ కి చాలా దగ్గరగా సీన్లు రావలనుకుంటున్నారు. ఆ క్రమంలోనే తాజాగా ఓ కాస్టింగ్ కాల్ ను రిలీజ్ చేశారు సుక్కు అండ్ టీం. సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉన్న అన్ని వయసుల వారు.. ఆడాళ్లు, మగాళ్లు, పిల్లలు అందరూ పుష్ప ది రైజ్‌ ఆడిషన్స్కు రావచ్చని ఆ పోస్టర్ లో కోట్ చేసింది పుష్ప టీం. కాని చిత్తూరు యాస మాత్రం మస్ట్ అండ్ షుడ్‌ అంటూ ఓ కండీషన్‌ పెట్టింది. ఆసక్తిగల వారు జూలై 3,4,5 తేదీల్లో తిరుపతిలోని మేక్‌ మై బేబీ జేన్యూన్ స్కూల్లో జరిగే ఆడిషన్స్ కు రావాలని ఆ పోస్టర్లో మెన్షన్‌ చేసింది. అన్నట్టు టైమింగ్స్.. 10am to 5pm. సో టీవీ9 వ్యూవర్స్ ఇంట్రెస్ట్ వుంటే మీరు కూడా ఏమాత్రం తగ్గకండి..!!

Pushpa The Rule Poster

Pushpa The Rule Poster

పుష్ప.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి.. నెలలు గడుస్తున్నా మూవీ ఎఫెక్ట్ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన పుష్ప సినిమా ఒక్కసారిగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా వసూళ్ల విషయంలో ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో ఆ సినిమాలోని డైలాగ్‌ అదే స్థాయిలో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) రాయలసీమ యాసలో మాట్లాడిన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా డైలాగ్‌లు తెగ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..