Crime: రక్తపు మడుగులో మృతదేహాలు.. కొడవలితో నరికి చంపిన ఆనవాళ్లు.. అసలేం జరిగింది

ముంబయిలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రైవర్ తో కలిసి, తన తల్లిని, సొంత అక్కను దారుణంగా చంపేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది....

Crime: రక్తపు మడుగులో మృతదేహాలు.. కొడవలితో నరికి చంపిన ఆనవాళ్లు.. అసలేం జరిగింది
crime news
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 30, 2022 | 6:38 PM

ముంబయిలో (Mumbai) దారుణ ఘటన జరిగింది. ఓ బాలిక డ్రైవర్ తో కలిసి, తన తల్లిని, సొంత అక్కను దారుణంగా చంపేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ముంబయిలోని కందివలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో లభించిన లేఖలో ఇద్దరిని హత్య చేసి, తాము ఆత్మహత్య చేసుకున్నట్లు రాసి ఉంది. శివ్ దయాల్ సేన్ అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భూమి అనే బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో ఆ బాలిక తన తల్లిని, అక్కను చంపేయాలని నిర్ణయించారు. ముందస్తు పథకం ప్రకారం ఇద్దరినీ హత్య చేసింది. అనంతరం డ్రైవర్ తో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నలుగురూ చనిపోయిన రెండు అంతస్తుల భవనం ఇల్లు, ఆస్పత్రిగా ఉంది. హత్యకు గురైన వారిని కిరణ్​ దాల్వి, ఆమె కూతురు ముస్కాన్​గా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్న చిన్న కుమార్తె పేరు భూమి, డ్రైవర్ పేరు శివ్​దయాల్​సేన్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కందివలి(వెస్ట్​)లోని దేనా బ్యాంక్ జంక్షన్​లో ఓ వ్యక్తి కొడవలి పట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి చేరుకోగా దాల్వి హాస్పిటల్ భవనంలోకి కొడవలితో హల్ చల్ చేస్తున్న వ్యక్తి, ఇద్దరు మహిళలు వెళ్లారని, ఆ తర్వాత లోపలి నుంచి అరుపులు కేకలు వినిపించిట్లు స్థానికులు చెప్పారు. నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!