AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: చంద్రబాబు ఎప్పడూ ఎన్టీఆర్ కు వారసుడు కాలేడు.. మాజీ మంత్రి కొడాలి షాకింగ్ కామెంట్స్

టీడీపీ(TDP) నేతలపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు....

Andhra Pradesh: చంద్రబాబు ఎప్పడూ ఎన్టీఆర్ కు వారసుడు కాలేడు.. మాజీ మంత్రి కొడాలి షాకింగ్ కామెంట్స్
Kodali Nani Latest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 29, 2022 | 5:39 PM

టీడీపీ(TDP) నేతలపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో పేర్ని నాని పోటీ చేసినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి బరిలో ఉన్నా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని కాదని అన్నారు. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు. అన్న కొడాలి.. అంతే కానీ మామా, అల్లుళ్లు కాదన్నారు. వారసత్వమంటే వైఎస్సార్‌.. జగన్‌. సీనియర్‌ ఎన్టీఆర్‌(NTR) జూనియర్‌ ఎన్టీఆర్‌. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబు ఎప్పటికీ కాలేడని.. మనవళ్లే వారసుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

కాగా.. గతంలో కొడాలి నానిపై టీడీపీ లీడర్ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ బహిరంగ సభ నిర్వహిస్తామంటే కొడాలి నానికి చెమటలు పడుతున్నాయని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు అంటే కొడాలి నానికి భయం కలుగుతోందని చెప్పారు. 2009 లో చంద్రబాబు చేతిలో బీ-ఫామ్ తీసుకున్న విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడిచింది ఎవరో అందరికీ తెలుసునన్న బుద్దా వెంకన్న.. ఈ అంశంపై చర్చకు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..