ఏపీ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. జులై నుంచి ఆ ఏడు రైళ్ల పునరుద్ధరణ.. వివరాలు చెక్ చేసుకోండి

Railway News: ఏపీలోని రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని పలు ప్రాంతాల మధ్య నడిచే ఏడు రైళ్లను జులై మాసం నుంచి పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

ఏపీ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. జులై నుంచి ఆ ఏడు రైళ్ల పునరుద్ధరణ.. వివరాలు చెక్ చేసుకోండి
Railway News
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 29, 2022 | 12:44 PM

AP Railway Passenger Alert: ప్రయాణీకుల సౌకర్యార్థం పలు చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ఇప్పటికే పలు రైళ్లను పునరుద్ధరించగా.. వేసవి సీజన్‌లో పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపింది. దాదాపుగా కోవిడ్ పాండమిక్‌ మినుపటి స్థాయిలో రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలోని పలు ప్రాంతాల మధ్య నడిచే ఏడు రైళ్లను జులై మాసం నుంచి పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరణాలను ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

  1. తిరుపతి – కాట్పాడి రైలును (రైలు నెం.07581/పాత నెం.57405) జులై 11 తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ఉదయం 10.55 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.30 గం.లకు కాట్పాడి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
  2. కాట్పాడి-తిరుపతి రైలును (నెం.07582/పాత నెం.57406) జులై 11 తేదీ నుంచి పునరుద్ధరిస్తారు. ఇది రాత్రి 09.55 గం.లకు కాట్పాడి నుంచి బయలుదేరి రాత్రి 11.50 గం.లకు తిరుపతి చేరుకుంటుంది.
  3.  గుంటూరు – విజయవాడ రైలును (నెం.07864/పాత నెం.77205) జులై 18వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు సాయంత్రం 05.45 గం.లకు గుంటూరు నుంచి బయలుదేరి రాత్రి 07 గం.లకు విజయవాడకు చేరుకుంటుంది.
  4. తెనాలి – గుంటూరు రైలును (నెం.07282/పాత నెం.77297) జులై 18 తేదీ నుంచి పునుద్ధరించనున్నారు. ఈ రైలు మధ్యాహ్నం 03.45 గం.లకు తెనాలి నుంచి బయలుదేరి 04.40 గం.లకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మార్కాపూర్ రోడ్ – తెనాలి రైలును (నెం.07890/పాత నెం.77249) జులై 18 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ఉదయం 10.10 గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 02.45 గం.లకు తెనాలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
  7. నంద్యాల్ – కడప రైలును (నెం.07284/పాత నెం.77401) జులై 16 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు ఉదయం 05.50 గంటలకు బయలుదేరి 09.40 గం.లకు కడప రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
  8.  కడప – నంద్యాల్ రైలును (నెం.07285/పాత నెం.77402) జులై 17 తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ రైలు సాయంత్రం 05.30 గం.లకు కడప నుంచి బయలుదేరి రాత్రి 09.30 గం.లకు నంద్యాల్‌కు చేరుకుంటుంది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..