Viral: వాహన తనిఖీల్లో మూడు కార్లు ఆపిన పోలీసులు.. అనుమానంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్!

సాధారణ వాహన తనిఖీలు చేపడుతోన్న పోలీసులకు మూడు కార్లు అనుమానంగా కనిపించాయి.. వాటిని ఆపి చెక్ చేయగా దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Viral: వాహన తనిఖీల్లో మూడు కార్లు ఆపిన పోలీసులు.. అనుమానంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్!
Vehicle CheckingImage Credit source: Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2022 | 12:06 PM

విజయవాడలోని టోల్ ప్లాజాల దగ్గర పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతీ వాహనాన్ని చెక్ చేయకుండా వదిలిపెట్టడం లేదు. అయితే వారికి ఈలోగా ఓ మూడు కార్లపై కన్ను పడింది. వాటిని నడిపే డ్రైవర్స్‌పై అనుమానమొచ్చింది. దీనితో వెంటనే ఆ మూడు కార్లను టోల్ ప్లాజా దగ్గర ఆపి చెక్ చేయగా.. పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విజయవాడ కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తోన్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నెల 24వ తేదీన చెన్నై నుంచి గుంటూరు, రాజమండ్రికి బంగారం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు టోల్ ప్లాజాల వద్ద నిఘా పెట్టి.. ఆ ముఠా గుట్టురట్టు చేశారు.

ఇవి కూడా చదవండి

అసలేం జరిగిందంటే..

అక్రమంగా భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విజయవాడ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో వాళ్లు అన్ని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే బోలపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా మూడు కార్లు కనిపించాయి.. వాటిని ఆపి చెక్ చేయగా సీట్ల కింద ప్రత్యేక అరల్లో బంగారం బిస్కెట్లు, ఆభరణాలు లభ్యమయ్యాయి. మొత్తం మూడు కార్లలోనూ సుమారు 10.77 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ బంగారం మార్కెట్ విలువ రూ. 5.80 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!