AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రైల్వేస్టేషన్‌లో కంగారుగా కనిపించిన ఆ ఇద్దరూ.. ఎంక్వైరీ చేయగా పోలీసులకు మైండ్ బ్లాంక్!

ఓ అమ్మాయి, ఓ అబ్బాయి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై కంగారుగా తచ్చాడుతూ జీఆర్‌పీ పోలీసులకు కనిపించారు...

Viral: రైల్వేస్టేషన్‌లో కంగారుగా కనిపించిన ఆ ఇద్దరూ.. ఎంక్వైరీ చేయగా పోలీసులకు మైండ్ బ్లాంక్!
Viral
Ravi Kiran
|

Updated on: Jun 28, 2022 | 8:22 PM

Share

ఓ అమ్మాయి, ఓ అబ్బాయి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై కంగారుగా తచ్చాడుతూ జీఆర్‌పీ పోలీసులకు కనిపించారు. వారికి ఆ ఇద్దరిపై అనుమానం రావడంతో.. ఎవరు.? ఎక్కడ నుంచి వచ్చారు.? ఎక్కడికి వెళ్తున్నారు.? అనే ప్రశ్నలు సంధించారు. దానికి ఆ ఇద్దరు దగ్గర నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చాయి. దీనితో స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. అసలు నిజం బయటపడింది. ఇంతకీ ఆ కథేంటంటే.!

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని పరుఖాబాద్‌కు చెందిన ఇద్దరు మైనర్లు.. గత కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల్లో ఇద్దరూ మేజర్లు కాబోతున్నారు. అయితే ఈలోపే యువతి కుటుంబసభ్యులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అమ్మాయిని చూసుకునేందుకు అబ్బాయి తరపు వాళ్లు వచ్చే సమయం కూడా ఫిక్స్ చేశారు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక సదరు యువతి.. ఈ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పింది.

ఇవి కూడా చదవండి

అంతే! దెబ్బకు అతడు బైక్‌పై ప్రియురాలిని ఎక్కించుకుని.. తన ఊరు నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆగ్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా జీఆర్‌పీ పోలీసులు వీరిని గుర్తించడం.. కంగారుగా కనిపించడం.. పొంతన లేని సమాధానాలతో.. ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్ళి ప్రశ్నించడం జరిగింది. దానితో అసలు నిజం బయటపడింది. ఆ ఇద్దరి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో.. వారు రాత్రికి రాత్రే ఆగ్రా చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు వీరిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌