Teachers Fight: చెప్పులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్న టీచర్స్..! వీడియో చుస్తే షాక్ అవ్వడం ఖాయం..!

Teachers Fight: చెప్పులతో పొట్టుపొట్టుగా కొట్టుకున్న టీచర్స్..! వీడియో చుస్తే షాక్ అవ్వడం ఖాయం..!

Anil kumar poka

|

Updated on: Jun 28, 2022 | 9:04 PM

స్కూల్‌కి లేట్‌గా వస్తే పిల్లలను కొట్టడం చూశాం.. కానీ.. పంతుళ్లే పొట్టు పొట్టుగా కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అదే జరిగింది. పాఠశాలకు లేట్ వచ్చిందని ఉపాధ్యాయురాలిని చెప్పుతో


స్కూల్‌కి లేట్‌గా వస్తే పిల్లలను కొట్టడం చూశాం.. కానీ.. పంతుళ్లే పొట్టు పొట్టుగా కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అదే జరిగింది. పాఠశాలకు లేట్ వచ్చిందని ఉపాధ్యాయురాలిని చెప్పుతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. లఖీంపూర్‌ ఖేరీలోని మహేంగు ఖేరా గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. లేట్‌గా ఎందుకు వచ్చారంటూ ఆమెను నిలదీశారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ప్రిన్సిపల్ మరింత రెచ్చిపోయాడు. కాలి షూ తీసి ఉపాధ్యాయురాలిని కొట్టాడు. అతని దాడికి షాక్ అయిన టీచర్.. తాను కూడా చెప్పుతో ప్రిన్సిపల్‌ను కొట్టింది. ఈ ఘర్షణ పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ఎదుటే జరగడం విశేషం. ఈ ఘర్షణపై ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ గొడవను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 28, 2022 09:04 PM