Viral: ఇంటి వరండాలో నిద్రపోయిన తండ్రీకొడుకులు.. తెల్లారేసరికి ఊహించని షాక్!

ఓ తండ్రికొడుకులు కూడా ప్రశాంతంగా తమ ఇంటి వరండాలో నిద్రపోయారు.. కానీ తెల్లారేసరికి ఊహించని షాక్ తగిలింది..

Viral: ఇంటి వరండాలో నిద్రపోయిన తండ్రీకొడుకులు.. తెల్లారేసరికి ఊహించని షాక్!
Representative ImageImage Credit source: representative image
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 27, 2022 | 12:30 PM

రాత్రిళ్లు ఇంటి వరండాలో.. మేడపై పడుకోవడం చాలా మందికి అలవాటు.. ఇంట్లో ఏసీ.. ఫ్యాన్స్ ఉన్నా.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట నిద్రించేందుకే ఆసక్తి చూపిస్తుంటారు.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబం మొత్తం మేడపైన నిద్రిస్తుంటారు.. అలాగే ఓ తండ్రికొడుకులు కూడా ప్రశాంతంగా తమ ఇంటి వరండాలో నిద్రపోయారు.. కానీ తెల్లారేసరికి ఊహించని షాక్ తగిలింది.. దీంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‏కు పరుగుతీశారు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఆగ్రాలోని బఝేరా ప్రాంతం అచ్నేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే…

స్థానికంగా నివసిస్తోన్న కేలాల్, అతడి కుమారుడు లవకుష్ రాత్రివేళ ఇంటి బయట వరండాలో నిద్రపోయారు. అయితే పడుకునే ముందు వారు అనుకోకుండా ఇంటి తలుపులకు తాళం వెయ్యడం మర్చిపోయారు. ఇదే అదునుగా చేసుకున్న దొంగలు.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి.. అల్మారాలో ఉన్న సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇక తెల్లారి లేచి చూసేసరికి.. గది తలుపులు తెరిచి ఉండటాన్ని తండ్రీకొడుకులు గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా అరలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.