Viral Video: వీడి ఆవేశం తగలెయ్యా.. విమాన సిబ్బందిని కొట్టేందుకు భార్యను నెట్టేశాడు.. షాకింగ్ వీడియో..

Viral Video: 'తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు మిత్రువు'.. ఈ పద్యాన్ని చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ చదివే ఉంటారు. అయితే దీనిని ఆచరించే వారు మాత్రం చాలా తక్కువేనని చెప్పాలి...

Viral Video: వీడి ఆవేశం తగలెయ్యా.. విమాన సిబ్బందిని కొట్టేందుకు భార్యను నెట్టేశాడు.. షాకింగ్ వీడియో..
Narender Vaitla

|

Jun 27, 2022 | 11:12 AM

Viral Video: ‘తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు మిత్రువు’.. ఈ పద్యాన్ని చిన్నప్పుడు ప్రతీ ఒక్కరూ చదివే ఉంటారు. అయితే దీనిని ఆచరించే వారు మాత్రం చాలా తక్కువేనని చెప్పాలి. మనలో చాలా మంది కోపం వస్తే తెగ ఊగిపోతుంటారు. వెనకా ముందు చూసుకోకుండా చేతిలో ఏది ఉంటే దానిని విసిరేస్తుంటారు. పైగా ‘నాకు కోపం వస్తే అస్సలు కంట్రోల్‌ చేసుకోలేను, నా కోపానికి ఎవరైనా భయపడాల్సిందే’నని చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు ఈ కోపం అనుకోని ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతుంటుంది. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి తన కోపాన్ని ప్రదర్శించి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం సదరు వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఓ జంట ప్రయాణం నిమిత్తం యూకేలోని బ్రిస్టల్‌ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే ఆ జంట ఆల్కహాల్‌ సేవించి ఉన్నారన్న కారణంగా సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వారిని ఫ్లైట్‌లోకి అనుమతించేది లేదని నిరాకరించింది. దీంతో మొదట మహిళ సెక్యూరిటీ గార్డ్‌లతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర దుర్బాషలు ఆడుతూ వారిపై విరిచుకుపడింది. దీనంతటినీ వెనకాల నుంచి చూస్తున్న భర్త కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే డ్రింక్‌ చేసి ఉన్నాడు ఇంకేముంది.. భార్యను ఒక్క కుదుపుతో పక్కకు నెట్టేశాడు. దీంతో ఆమె పక్కనే ఉన్న గొడకు తాకి కింది పడిపోయింది. అదే కోపంతో వెళ్లి సెక్యూరిటీ గార్డ్‌లపై పిడి గుద్దులు గుద్దాడు. అయితే కింద పడ్డ మహిళ వెంటనే పైకి లేచి మళ్లీ సెక్యూరిటీ గార్డ్‌లపై అటాక్‌ చేయడానికి వెళ్లింది. మైక్‌ టైసన్‌ల పంచులు విసిరిన భర్తను వెనక్కి నెట్టిమరీ సెక్యూరిటీ సిబ్బందిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

దీనంతటటినీ అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు జంటపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ జంటను అరెస్ట్‌ చేసి అదుపులోకి తీసుకొని విచారించారు. మరి పోలీసుల ట్రీట్‌మెంట్‌ అయిన అతని కోపాన్ని తగ్గించిందో లేదో..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu