Viral Video: మనుషులను సైతం ఆలోజింపజేస్తున్న తాబేళ్లు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..
Viral Video: సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది కూడా మరో మనిషే. అయితే పెరుగుతోన్న స్వార్థం కారణంగా పక్కన వారి గురించి పట్టించుకునే సమయం కూడా ఉండడం లేదు...
Viral Video: సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది కూడా మరో మనిషే. అయితే పెరుగుతోన్న స్వార్థం కారణంగా పక్కన వారి గురించి పట్టించుకునే సమయం కూడా ఉండడం లేదు. మా జీవితాలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి అంటూ దీనికి ఒక జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకుంటారు. అయితే సాటి మనిషికి సహాయం అందించకపోతే మనకు అవసరం వచ్చినప్పుడు కూడా ఎవరూ అండగా నిలవరనేది నిర్వివాద అంశం. మరి మనుషుల్లో ఈ మానవత్వం ఎంత ఉందో తెలియదు కానీ మూగ జీవాలు మాత్రం తమకు కరుణ ఉందని, తమ తోటి జీవికి కష్టం వస్తే అందరం ఒక్కటై అండగా నిలుస్తామని చాటి చెప్పాయి.
తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ నీటి కొలనులో తాబేళ్లన్నీ సేద తీరుతున్నాయి. ఇదే సమయంలో ఓ తాబేలు అనుకోకుండా రివర్స్‌లో పడిపోయింది. దీంతో ఎలాగైనా మళ్లీ సాధారణ పొజిషిన్‌లోకి రావాలని తీవ్ర ప్రయత్నం చేసింది. కాళ్లను వేగంగా కదుపుతూ రివర్స్ పడడానికి పడరాని పాట్లు పడింది. అయితే ఆ తాబేలుకు మాత్రం అది సాధ్యం కాలేదు.
దీంతో అక్కడున్న మిగతా తాబేళ్లన్నీ ఆ విషయాన్ని గమనించాయి. వెంటనే అన్ని కలిసి ఇబ్బంది పడుతోన్న ఆ తాబేలు వద్దకు వెళ్లి దానిని పైకి లేపాయి. దీనంతటినీ అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. ఆ తాబేళ్ల ఐకమత్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ వీడియో..
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..