Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుమార్తె వివాహంలో తండ్రి మైనపు విగ్రహం.. చూపరులను కంటతడి పెట్టిస్తున్న సన్నివేశం.. వీడియో వైరల్

ఒక కుమార్తె తన చనిపోయిన తండ్రి మైనపు దిష్టిబొమ్మ ముందు కూర్చుని వివాహం చేసుకుంది.. ఈ సన్నివేశం చూసిన ప్రజలు చాలా భావోద్వేగానికి గురవుతున్నారు.

Viral Video: కుమార్తె వివాహంలో తండ్రి మైనపు విగ్రహం.. చూపరులను కంటతడి పెట్టిస్తున్న సన్నివేశం.. వీడియో వైరల్
Wax Statue Of Late Father
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2022 | 7:02 AM

Viral Video: పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో (Social Media) చాలా వీడియోలు మీరు చూసి ఉంటారు. ఈ వీడియోలు కొన్నిసార్లు నెటిజన్లను చాలా నవ్విస్తున్నప్పటికీ, కొన్ని వీడియోలు చూడటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం ప్రత్యేకం అనిపిస్తాయి. అంతేకాదు అలాంటి వీడియోలు చూసిన వారిని కంట తడిపెట్టిస్తాయి. ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అలాంటి ఓ వీడియో ఒకటి వైరల్ వీడియో అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెళ్లి వీడియో కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక కుమార్తె తన చనిపోయిన తండ్రి మైనపు దిష్టిబొమ్మ ముందు కూర్చుని వివాహం చేసుకుంది.. ఈ సన్నివేశం చూసిన ప్రజలు చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. .

ఈ సంఘటన తమిళనాడులోని కల్లకురిచి జిల్లా తిరుకోవిలూర్ ప్రాంతంలో ఉన్న థానకనందల్ గ్రామంలో చోటు చేసుకుంది. సెల్వరాజ్ (56) అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో మరణించాడు. సెల్వరాజ్ అకాలమరణంతో కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. ముఖ్యంగా సెల్వరాజ్ కూతురు మహేశ్వరికి జయరాజ్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. జూన్ నెలలో కూతురు మహేశ్వరీ పెళ్లి చేయడానికి కుటుంబం రెడీ అయిన నేపథ్యంలో సెల్వరాజ్ మరణం ఆ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

కూతురి పెళ్లిని ప్రత్యేకంగా నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు తండ్రిని పోగొట్టుకున్న బాధనుంచి కూతురు మహేశ్వరి బయటపడలేకపోయింది. దీంతో మహేశ్వరి బాధను దూరం చేసేందుకు పెళ్లిలో వేరే ఏదైనా చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. కూతురికి పెళ్లి చేసి..  సంతోషంగా అత్తారింటికి పంపించేందుకు ఆమె తల్లి ఐదు లక్షల రూపాయలు వెచ్చించి సెల్వరాజ్ మైనపు ప్రతిమను తయారు చేయించింది. పెళ్లి రోజు పూజారుల సమక్షంలో కళ్యాణ మండపం దగ్గర ఉంచింది.

పెళ్లికూతురు మంటపంలో అడుగు పెట్టిన తర్వాత తండ్రి మైనపు బొమ్మని చూడగానే చూస్తూ ఉండిపోయింది. తన తండ్రి మైనపు విగ్రహాన్ని చూసి షాక్‌కు గురైన పెళ్లికూతురు చాలా సేపు అతడిని చూస్తూ ఉండిపోయింది. తండ్రి బొమ్మ దగ్గర కూర్చొని కంట తడిపెట్టుకుంది. పెళ్లిలో ఈ దృశ్యం చూపరులను అతిధులను భావోద్వేగానికి గురి చేసింది. ఇంటి పెద్ద పట్ల కుటుంబీకుల  ప్రేమను చూసి అక్కడున్న వారందరి కళ్లూ తడి అయ్యాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..