Viral video: ఫ్లైట్‌లో పనిచేయని ఏసీ.. ఊపిరాడక ప్రయాణికుల హాహాకారాలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
టేకాఫ్ అయిన విమానంలో ఉన్నట్లుండి ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరైతే మూర్ఛపోయారు. మరికొందరికి విపరీతంగా ముచ్చెమటలు పట్టడంతో హాహాకారాలు చేశారు..
టేకాఫ్ అయిన విమానంలో ఉన్నట్లుండి ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. ఊపిరాడకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కొందరైతే మూర్ఛపోయారు. మరికొందరికి విపరీతంగా ముచ్చెమటలు పట్టడంతో హాహాకారాలు చేశారు. గో ఎయిర్ విమాన సంస్థకు చెందిన డెహ్రాడూన్-ముంబై జీ8 2316 విమానంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. విమానంలోని ప్రయాణికులు కొందరు తమ దీనస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్‌గా మారింది. గో ఫస్ట్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లోని ప్రయాణికులు ఏసీ సిస్టమ్‌పై ఫిర్యాదు చేస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే చాలా మంది ప్రయాణికులకు విపరీతంగా చెమటలు పట్టి ఇబ్బంది పడడం మనం చూడొచ్చు. ఇక శ్వాస పీల్చుకోలేకపోతున్న ఒక మహిళను మరొక మహిళను ముందుకు తీసుకెళ్లింది.
రూ.12వేలు పెట్టి టికెట్ కొంటే..
ఇక ఫ్లైట్‌లో క్యాన్సర్ రోగి ఉన్నారని, చాలా భయపడిపోతున్నారని ఓ మహిళ అరవడం వినిపించింది. విమానంలో ముగ్గురు వ్యక్తులు స్పృహ తప్పి పడిపోయారని, మెజారిటీ ప్రయాణికులు చెమటలు కక్కుతూ అసౌకర్యానికి గురయ్యారని వీడియోలోని టెక్ట్స్ లో కనిపించింది. రూ.12వేలు పెట్టి టికెట్ కొన్న ఫ్లైట్‌లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా లేదని, ఆక్సీమీటర్లు అందుబాటులో ఉంచలేదని ప్రయాణికులు ఫిర్యాదు చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినవారంతా గో ఎయిర్ విమాన సంస్థపై మండిపడుతున్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత విమానయాన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
@GoFirstairways G8 2316 was one of the worst experiences!With Ac’s not working & a full flight,suffocation struck passengers had no way out,sweating profusely paranoid passengers were on the verge of collapsing.3 ppl fainted,a chemo patient couldn’t even breathe.#complaint pic.twitter.com/mqjFiiQHKF
— Roshni Walia (@roshniwalia2001) June 14, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..