Viral Video: సూప్ నుంచి ఏబీసీడీ అక్షరాలు తీసి..రికార్డ్ సృషించవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా.. అయితే ఈ వ్యక్తి చేసిన పని అదే
ఆల్ఫాబెట్ సూప్ అంటే ABCD అని రాసి వుండాలి.. అయితే సుప్ ను ఉపయోగించుకుని కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా! అసలు అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ అమెరికాలోని ఒరెగాన్‌లో నివసిస్తున్న జాకబ్ చాండ్లర్ ఇలా ఆలోచించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
Viral Video: ప్రపంచంలో తమ తెలివి తేటలను భిన్నమైన పద్ధతుల్లో ప్రదర్శించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఏదైనా భిన్నమైన, కొత్తది చేయాలనే మక్కువ కలిగి ఉంటారు. తమ అభిరుచిని రియాలిటీగా మార్చుకోవడానికి భిన్నంగా ప్రయత్నిస్తారు. కొన్ని వింతలు చేసి కూడా ప్రపంచ రికార్డు సృష్టించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. ఇటీవల ఓ వ్యక్తి.. బర్గర్ తింటూ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయగా.. మరొకరు మేక్సిన్ రొట్టెను అత్యంత దూరం విసిరి రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు అలాంటి రికార్డ్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒక వ్యక్తి సూప్ నుండి ABCDలను కేవలం 2 నిమిషాల్లో చరిత్ర సృష్టించాడు. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఓస్ ఇందులో పెద్ద విషయం ఏంటి.. ఈజీనే అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఎంత కష్టమో అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఆల్ఫాబెట్ సూప్ అంటే ABCD అని రాసి వుండాలి.. అయితే సుప్ ను ఉపయోగించుకుని కూడా ప్రపంచ రికార్డు సృష్టించవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా! అసలు అలాంటి ఆలోచన మీకు వచ్చి ఉండకపోవచ్చు. కానీ అమెరికాలోని ఒరెగాన్‌లో నివసిస్తున్న జాకబ్ చాండ్లర్ ఇలా ఆలోచించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. వాస్తవానికి, అతను సూప్ నుండి కేవలం 2 నిమిషాల 8.6 సెకన్లలో 26 ఆంగ్ల అక్షరాలను కనుగొన్నాడు. అంతేకాదు వాటిని క్రమపద్ధతిలో అలంకరించాడు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. జాకబ్ తన 11 ఏళ్ల కొడుకును ఈ ప్రపంచ రికార్డుతో ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఏ వ్యక్తి అయినా తాను కలలుగన్న ప్రతిదాన్ని సాధించగలడు. దానికి తగిన కృషి,పట్టుదల ఉండాలంతే. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జాకబ్ వీడియోను కూడా షేర్ చేసింది. అందులో అతను సూప్ నుండి ABCD తీయడం కనిపిస్తుంది.
పెద్ద గిన్నెలో ఉన్న డబ్బాలోని సూప్‌ని జాకబ్ బయటకు తీయడం.. అందులోని అక్షరాలను గుర్తించిన తర్వాత.. వాటిని చెంచాతో బయటకు తీసి సరిగ్గా అమర్చడం వీడియోలో చూడవచ్చు. ఇలా చేయడానికి జాకబ్ కేవలం 2 నిమిషాల 8.6 సెకన్లు తీసుకున్నాడు. దీంతో అత్యంత వేగవంగా.. అక్షరాలను గురించిన వ్యక్తి అయ్యాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..