Viral Video: కొంగ తెలివి మాములుగా లేదుగా.. ఎర వేసి మరీ చేపలను వేటాడుతుందిగా..
కొంగ (heron viral video) మొదట నది ఒడ్డున నిలబడి చేపలను ప్రలోభపెట్టి, ఆపై వాటిపై దాడి చేసి వాటిని వేటాడుతుంది. పక్షి వేటగాడిగా ఆహారాన్ని సంపాదిస్తున్న ఈ ట్రిక్ ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.
Viral Video: ప్రపంచంలో ఒకజీవి మరొక జీవికి ఆహారమే.. ఇది ప్రకృతి ధర్మం. పక్షుల్లో కూడా రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. తమ ఆహారం సంపాదన కోసం అవి భిన్నపద్దతులను అవలంభించే పక్షులు అనేకం ఉన్నాయి. కొన్ని పక్షులు నీటిలోపలికి వెళ్లి ఆహారం అన్వేషిస్తే.. మరికొన్ని అవి నీటి వెలుపల నిలబడి చేపల కోసం వేచి ఉంటాయి. చేపలు కనిపించగానే వాటిపైకి దూసుకెళ్లి వాటిని తమ ఆహారంగా తీసుకుంటాయి. అయితే కొన్ని పక్షులు, జంతువులు మనుషుల మాదిరిగానే ఆహారం కోసం ఎరను వల వేసి.. వాటిపై దాడి చేస్తాయని మీకు తెలుసా..! తాజాగా ఓ పక్షి వీడియో ఒకటి బయటపడింది. ఇందులో కొంగ (heron viral video) మొదట నది ఒడ్డున నిలబడి చేపలను ప్రలోభపెట్టి, ఆపై వాటిపై దాడి చేసి వాటిని వేటాడుతుంది. పక్షి వేటగాడిగా ఆహారాన్ని సంపాదిస్తున్న ఈ ట్రిక్ ని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కొంగ వేట కోసం నది ఒడ్డుకు వచ్చి బ్రెడ్ నదిలోకి విసిరివేసింది. కొన్ని చేపలు ఒడ్డుకు వచ్చి ఆ ఎరను తింటున్నాయి. అప్పుడు ఆ చేపలను పట్టుకుని కొంగ ఆహారంగా భుజిస్తుంది. అయితే తాను ఎర వేసిన ప్లేస్ లో చేపలు లేవని గుర్తించిన కొంగ.. నీటి నుండి ఎర తీసుకుంది. ఇది వీడియోలో మీరు చూడవచ్చు. కొంగను బయటకు తీసిన ఎరను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంలో పెట్టి.. చేపల కోసం ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇలా కొంగ రెండు మూడు సార్లు ఎరను ఒక చోట నుంచి మరొక చోటకు మార్చి ప్రయత్నించింది. చివరిసారిగా ఆ ఎరను నీటిలో ఉంచి.. నీటి కింద నుండి ఒక చేప ఎరవైపు రావడం చూసి కోన తన దృష్టిని నిలిపి.. నోటితో చేపను క్యాచ్ పట్టింది.
ఎరగా ఉపయోగిస్తున్న ఈ కొంగను చూడండి …
Look at this heron using bread as fishing bait …pic.twitter.com/NkSV476zGQ
— Science girl (@gunsnrosesgirl3) June 25, 2022
ఈ వీడియో @gunsnrosesgirl3 అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్లిప్‌కి 61 లక్షలకు పైగా వ్యూస్ ను , 2.5 లక్షలకు లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇది ఎంత సహజంగా ఉంది. ఎంత అద్భుతమైన క్లిప్ – చాలా స్పూర్తిదాయకమైనది. కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలు మన అవసరాలకు ఎలా ఆజ్యం పోస్తాయో చూపిస్తుంది థాంక్స్ అని కామెంట్ చేశారు. ‘కొంగ నిజంగా గొప్ప మనస్సును కలిగి ఉంది.’ ‘వావ్, దేవుడు ఈ కొంగను చాలా తెలివైనదానిగా పుట్టించాడు.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.