Viral: నదిలో పడిపోయిన ఐఫోన్.. 10 నెలల తర్వాత దొరికింది.. ఆన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!

నదిలో పడిపోయిన మొబైల్ ఫోన్ మళ్లీ తిరిగి దొరుకుతుందా.? ఏంటి ఈ పిచ్చి ప్రశ్న.! అస్సలు దొరకదు.. అది అసాధ్యం అని అంటారా.?

Viral: నదిలో పడిపోయిన ఐఫోన్.. 10 నెలల తర్వాత దొరికింది.. ఆన్ చేసి చూడగా మైండ్ బ్లాంక్!
Iphone
Follow us

|

Updated on: Jun 27, 2022 | 10:26 AM

నదిలో పడిపోయిన మొబైల్ ఫోన్ మళ్లీ తిరిగి దొరుకుతుందా.? ఏంటి ఈ పిచ్చి ప్రశ్న.! అస్సలు దొరకదు.. అది అసాధ్యం అని అంటారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. 10 నెలల కిందట ‘వై రివర్’‌లో జారిపడిన ఓ ఐఫోన్ తిరిగి ఆ ఓనర్ దగ్గరకు చేరింది. అదెలాగంటారా.? ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌కు చెందిన ఓవైన్ డేవిస్ సరిగ్గా పది నెలల కిందట ‘వై నది’లో తన బ్రాండెడ్ ఐఫోన్‌ను పడేసుకున్నాడు. ఇంకేముంది నదిలో ఫోన్ పడిపోతే.? దొరుకుతుందా.? దొరకడం చాలా కష్టమే. అదే నిరుత్సాహంతో డేవిస్ ఇంటికి చేరుకున్నాడు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అతడి ఐఫోన్ సరిగ్గా 10 నెలల తర్వాత తిరిగి తన దగ్గరకు చేరుకుంది. ఇది ఫస్టాఫ్ అయితే..

సెకండాఫ్‌లో స్టోరీ ఇలా ఉంది… గ్లౌసెస్టర్‌షైర్‌కు చెందిన మిగ్గీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి వై రివర్‌లో ప్రయాణిస్తుండగా.. అతడికి ఓ ఐఫోన్ దొరికింది. దాన్ని ఇంటికెళ్ళి చెక్ చేయగా.. ఆ ఫోన్ అద్భుతంగా పని చేయడం చూసి ఆశ్చర్యపోయాడతడు. ఈ విషయాన్ని.. ఆ ఐఫోన్ ఫోటోలను జత చేసి మరీ ఫేస్‌బుక్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. ఇంకేముంది ఆ సోషల్ మీడియా పోస్ట్ కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ఠక్కున యూకేలోని లోకల్ గ్రూప్స్‌లో ప్రత్యక్షమైంది.

అంతే.. దాన్ని చూసిన ఓ వ్యక్తి.. ఆ ఫోన్ తన స్నేహితుడు డేవిస్‌దేనని గుర్తించాడు. ఆ సోషల్ మీడియా పోస్టును డేవిస్‌కు షేర్ చేశాడు. దీనితో డేవిస్.. తన ఫోనేనని మిగ్గీకి కొన్ని ఆధారాలు పంపించడంతో కథ కాస్తా క్లైమాక్స్‌కు చేరింది. కాగా, ఇదంతా ఒక ఎత్తయితే.. నదిలో పడిపోయి.. 10 నెలల దాటినా కూడా.. ఐఫోన్ బాగా పని చేస్తుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Iphone Lost

జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.