Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ‘M’ అక్షరాన్ని కనిపెడితే మీరే జీనియస్.. ట్రై చేయండి!

మనకు అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తారసపడే ఫోటో పజిల్స్.. మెదడుకు పని చెప్పడమే కాదు.. కళ్లకు కూడా పదును పెడతాయి..

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో 'M' అక్షరాన్ని కనిపెడితే మీరే జీనియస్.. ట్రై చేయండి!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 28, 2022 | 5:21 PM

ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇక నెట్టింట క్షణాల్లో మనకు కావల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఫోటోలు, వీడియోలు, ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్.. ఇలా ప్రతీది తరచూ వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. మనకు అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తారసపడే ఫోటో పజిల్స్.. మెదడుకు పని చెప్పడమే కాదు.. కళ్లకు కూడా పదును పెడతాయి. లేట్ ఎందుకైతే.. మీకు సవాళ్లంటే ఇష్టమైతే.? ఇదిగో ఇది మీకోసమే.. నెట్టింట హల్చల్ చేస్తోన్న ఓ ఫోటో పజిల్‌ను ఇప్పుడు చూద్దాం.. చూశారా.! మొత్తం ‘W’ అక్షరాలతో నిండిన ఆ ఫోటోలో ఓ ‘M’ అక్షరం ఉంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమైన పజిలే.. కానీ నిశితంగా దృష్టి పెడితే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. చాలామంది నెటిజన్లు ఈ పజిల్‌ను సాల్వ్ చేయాలనుకున్నారు.. కానీ చివరికి పప్పులో కాలేశారు. మరి మీ సంగతేంటి.? ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ మీరూ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయితే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

సమాధానం: మూడో వరుస 5వ అక్షరం.. అలాగే 24వ అక్షరం ‘M’.. సరిగ్గా చూస్తే మీకే దొరికేస్తుంది.. 

ఇవి కూడా చదవండి