Sonu Sood: స్ట్రీట్ ఫుడ్‌పై మనసుపడ్డ సోనూసూద్‌.. స్టాల్‌ ఓనర్‌కి స్పెషల్‌ రిక్వెస్ట్‌.. ఏంటంటే..?

కరోనా కాలంలో నటుడు సోనూ సూద్ ప్రజలకు దేవుడిగా మారాడు. వేలాది మందికి సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి ఫుడ్ స్టాల్..

Sonu Sood: స్ట్రీట్ ఫుడ్‌పై మనసుపడ్డ సోనూసూద్‌.. స్టాల్‌ ఓనర్‌కి స్పెషల్‌ రిక్వెస్ట్‌.. ఏంటంటే..?
Street Food Stall
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 6:17 PM

సోనూ సూద్.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు సినిమాల్లో విలన్ గా మాత్రమే ఆయన అందరికీ తెలుసు. కానీ, కరోనా కాలంలో నటుడు సోనూ సూద్ ప్రజలకు దేవుడిగా మారాడు. వేలాది మందికి సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా కాలంలో.. వలస కూలీలు.. తమ ఇళ్లకు చేరుకున్నారు అంటే అది ఆయన వల్లనే. కేవలం వలస కూలీలు ఇళ్లకు చేరటమే కాదు.. చాలా మందిని స్వావలంబనగా దిశగా మార్చడానికి కూడా సోనూ సూద్‌ సహాయపడ్డారు. ఇంటికి చేరిన తర్వాత, అనేకమంది సోనూ సుద్‌ పేరుమీద సొంత వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు సహాయపడ్డారు.

తాజాగా తూర్పు ఢిల్లీకి చెందిన ఓ వ్య‌క్తి ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను సోనూ సూద్ స‌మ‌కూర్చాడు. ఇప్పుడు ఆ స్టాల్‌ మంచి లాభాలతో సాగుతోంది. అతను తన స్టాల్‌కి సోనూసూద్ పేరు పెట్టాడు. త‌న‌కు సాయం అందించిన సోనూ సూద్ పేరుతోనే ఫుడ్ స్టాల్‌ను ఆ వ్య‌క్తి ప్రారంభించాడ‌ని ఆరాధ‌న రాథోడ్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

తూర్పు ఢిల్లీలోని త‌మ అపార్ట్‌మెంట్ స‌మీపంలో ఆరు నెల‌ల కిందట వెలిసిన ఫుడ్ స్టాల్‌కు క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతూ ఇప్పుడు మంచి వ్యాపారం సాగిస్తోంద‌ని ట్విట్టర్‌ యూజర్‌ పేర్కొన్నారు. సోనూ సూద్ సాయంతో స‌ద‌రు వ్య‌క్తి త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌గ‌లిగాడ‌ని పోస్ట్‌లో ప్ర‌స్తావించారు. ఈ పోస్ట్‌పై స్పందించిన సోనూ సూద్ త‌న‌కూ ఓ ప్లేట్ నాన్ ఇవ్వాల‌ని సోద‌రుడికి చెప్పండ‌ని కామెంట్ చేశారు. 32 సెకన్ల నిడివిగల సోనూ సూద్ ఫుడ్ స్టాల్ వీడియో ఇప్ప‌టివ‌ర‌కూ 87,000కు పైగా వ్యూస్ రాబ‌ట్టింది. వేలాది మంది ప్రజలు వీడియోను లైక్‌ చేశారు. ఆప‌ద‌లో ఉన్న వారికి ఆప‌న్న హ‌స్తం అందిస్తున్న సోనూ సూద్‌ను నెటిజ‌న్లు ప్ర‌శంసించారు. సోనూ సూద్ ఇటీవ‌ల బిహార్‌కు చెందిన బాలిక‌కు అరుదైన స‌ర్జరీ చేసేందుకు అవ‌స‌ర‌మైన సాయం అందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి