Danger of Antibiotics: విచ్చలవిడి యాంటీబయోటిక్స్‌ వాడకంతో.. కొత్త రకం బ్యాక్టీరియా..! ముప్పు తప్పదంటున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు..

కరోనా కాలంలో చాలా మంది రకరకాల యాంటీ బయోటిక్స్‌ మందులను చాలా విరివిగా వాడేశారు.. ఇప్పుడు అదే మనిషి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. ఇప్పుడు చాలా రకాల యాంటిబయోటిక్స్‌ టాబ్లెట్స్ చాలా మందికి

Danger of Antibiotics: విచ్చలవిడి యాంటీబయోటిక్స్‌ వాడకంతో.. కొత్త రకం బ్యాక్టీరియా..! ముప్పు తప్పదంటున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు..
Danger Of Antibiotics
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 28, 2022 | 5:49 PM

Danger of Antibiotics: ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా..ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు.. ఆరోగ్యవంతుడైన మనిషి..అడివిలోనైనా బ్రతికేయగలడు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఆరాటంతో ఇప్పుడు చాలా మంది ప్రమాదంలో పడిపోతున్నారు. కరోనా కాలంలో చాలా మంది రకరకాల యాంటీ బయోటిక్స్‌ మందులను చాలా విరివిగా వాడేశారు.. ఇప్పుడు అదే మనిషి ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. ఇప్పుడు చాలా రకాల యాంటిబయోటిక్స్‌ టాబ్లెట్స్ చాలా మందికి పని చేయడంలేదు. కొద్ది కాలం క్రితం వరకూ ఇది ఒక సమస్య మాత్రమే. ఈ కరోనా కాలంలో ఇది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. చివరికి ..పలురకాల యాంటీబయోటిక్స్‌ టాబ్లెట్స్ పనిచేయకపోవడం ఒక డేంజర్‌ అయితే… ఈ టాబ్లెట్స్ పరిధి దాటి.. అనేక మంది డేంజర్‌ లెవెల్ లో పడ్డారు. ఆశ్చర్యం గా ఉన్నా… ఇప్పుడు కొన్ని మందులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

ఇలాంటి డేంజర్‌ పరిస్థితిని డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్మెంట్‌ గుర్తించింది. దీని వల్ల అనేక రూపాల్లో అతిపెద్ద ప్రమాదం మనల్ని ముంచుతొందని గుర్తించి హెచ్చిరికలు జారీచేస్తోంది. ఎంతో రీసెర్చ్ చేసి… కనుగొన్న యాంటిబయోటిక్స్‌ నిర్వీర్యం అవుతున్నాయి. ఇవి ఏ ఉద్దేశ్యంతో వీటిని తయారుచేశారో.. ఆ ఉపయోగం లేకుండా పోతున్నాయి అంటున్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ రామ్ ధన్. దీనికి …. విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ మందుల వాడకమే ప్రధాన కారణంగా కన్పిస్తోంది. రొంప.. జలుబు.. వొళ్లునొప్పులు.. ఇలా ఏదైనా సరే. ఒక టాబ్లెట్ వేసుకోవడం చాలా మందికి అలవాటుగా మారిపోయిందే. ఇదే ఇప్పుడు కొంప ముంచింది. ఇందులో ప్రధానంగా యాంటిబయోటిక్స్‌ ఉంటున్నాయి. ఇవి ఎన్ని రోజులు వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి అనేది లేకపోవడం వల్ల… అతి పెద్ద ప్రమాదంగా ముంచుకొచ్చింది. వైద్యుల సూచన ప్రిస్కిప్షన్‌ లేకుండా ఈ మందులు వేసుకుంటున్నారు. ఈ టాబ్లెట్స్ పనిచేయకపోవడమే కాదు.. వారి ఆరోగ్యాలు సైతం డేంజర్ లో పడుతుందన్నారు సీనియర్ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్ లక్ష్మికాంత్‌ రెడ్డి.

మానవ శరీరంలో అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా కంటే.. ఆరోగ్య వంతమైన బ్యాక్టీరియా చాలానే ఉంది. ఇలా మంచి చేసే బ్యాక్టీరియా… విచ్ఛలవిడి యాంటీ బయోటిక్స్‌ వాడకం వల్ల .. నాశనం అయిపోతున్నాయి. ఇది మరింత ప్రమాదకర పరిస్థితి అంటున్నారు డాక్టర్లు. హాని కలిగించే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ తో మరింత పటిష్టం కూడా అవుతోందంటున్నారు. యాంటీ వైరల్‌ మందులు తక్కువ కాబట్టి… యాంటీ బ్యాక్టీరియా డ్రగ్స్ వాడకం.. ఎక్కువ సాగుతోందన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్‌ విక్రమ్‌ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ప్రతి మెడిసిన్‌ అమ్మకాలకు డాక్టర్ల ప్రిస్కిప్షన్‌ తప్పని సరి… అందులో కొన్ని మందులకుఇంకా అవసరం. అయితే… చాలా మంది పాత మందుల చీటీలు తీసుకువచ్చి… మరోవైపు ఆన్‌లైన్ లో కొనుగోళ్లు… వాట్సాప్ లో ప్రిస్కిప్షన్లు తోనూ .. యాంటీబయోటిక్స్‌ కొనుగోలు చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఇది మరింత ఎక్కువైందంటున్నారు. అయితే.. ఇలా నిబంధనలు పాటించకుండా నేరుగా అమ్మకాలు చేస్తున్న మెడికల్‌ షాపులు కొన్ని ఉంటే.. కొందరు అమ్మలేమని చెబితే దాడులకు దిగే పరిస్థితి ఉంటోందంటున్నారు మెడిసిన్‌ అమ్మకందారులు. దీని వల్ల చాలా మంది రోగులకు నష్టమే కాదు… ఇప్పటికే రెండు జనరేషన్స్ మందులు దాటి మూడో జనరేషన్‌ కు చేరుకుంటున్నాయంటున్నారు. అంటే.. రెండు జనరేషన్స్ లో తయారైన మందులు పనిచేయకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు.

నిజంగానే ఇది ఒక డేంజర ఇండికేషన్‌. వ్యయప్రాయాసాల కోర్చి తయారుచేసిన మందులు ఎందుకూ కాకుండా పోతున్నాయి. ఇలా కొనసాగితే… భవిష్యత్‌ లో ఇప్పుడున్న యాంటీబయోటిక్స్‌ అన్నీ ఎందుకు పనికి రాకుండాపోతాయి. అందుకే… మందుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నాం అంటోంది డ్రగ్‌ కంట్రోల్‌. మరోవైపు డాక్టర్ల ప్రిస్కిప్షన్‌ లేకుండా అమ్మకాలు సాగించే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నామంటోంది తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్

ఇప్పటికైనా… విచ్ఛలవిడి మందుల వాడకం..అందులో యాంటిబైటిక్స్ వాడకాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే… భవిష్యత్‌ లో అత్యవసర స్థితిలో కూడా మందులు పనిచేయక ప్రాణాలు ఫణంగా పెట్టే డేంజర్ తక్కువ దూరంలోనే కన్పిస్తోంది.

గణేష్‌. వై, టివి9 తెలుగు, హైదరాబాద్‌

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..