Viral Video: పెళ్లిలో వరమాల పడినవెంటనే వరుడు చేసిన పనితో కంగుతిన్న వధువు..! షాక్‌లో బంధుమిత్రులు..

పెళ్లి వేడుకలలో వధూవరుల అనేక ఫన్నీ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తుంటాయి.. వివాహ వేడుకలో అనేక రకాల ఆచారాలు ఉంటాయి. పెండ్లి వేడుక‌ల్లో సాధార‌ణంగా వ‌ధువు చేత..

Viral Video: పెళ్లిలో వరమాల పడినవెంటనే వరుడు చేసిన పనితో కంగుతిన్న వధువు..! షాక్‌లో బంధుమిత్రులు..
Groom Touches Bride's Feet
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 3:38 PM

వధూవరుల వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలా పెళ్లి వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుకలలో వధూవరుల అనేక ఫన్నీ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తుంటాయి.. వివాహ వేడుకలో అనేక రకాల ఆచారాలు ఉంటాయి. పెండ్లి వేడుక‌ల్లో సాధార‌ణంగా వ‌ధువు చేత వ‌రుడి కాళ్లు మొక్కిస్తారు. తాళి క‌ట్టిన‌ప్పుడు, అక్షింత‌లు వేసిన‌ప్పుడు, గౌరీ పూజ జ‌రిగేట‌ప్పుడు, పూల‌దండ‌లు మార్చుకున్న‌ప్పుడు ఇలా చాలా సార్లు వ‌ధువు చేత వ‌రుడి కాళ్ల‌కు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెండ్లి వేడుక‌లో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా జ‌రిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌ వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో వ‌రుడే వ‌ధువు కాళ్లకు దండం పెట్టాడు. వరమాల వేడుక తర్వాత వరుడు వధువు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. వివాహ తంతు పూర్త‌య్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు దండ‌లు మార్చుకుంటున్న స‌మ‌యంలో పెండ్లి కొడుకు అక‌స్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్లను తాకాడు. ఈ అనూహ్య ప‌రిణామానికి పెండ్లికి హాజ‌రైన బంధు మిత్రులంతా ఆశ్య‌ర్చ‌పోయారు. ప్ర‌స్తుతం వ‌రుడు వ‌ధువు కాళ్లను మొక్కినట్టుగా ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్‌ల నుంచి లైక్‌లు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.

అందమైన ఈ వీడియో డిటిగోరాడియా అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. జూన్ 17న షేర్ చేసిన ఈ వీడియోను 4 లక్షల 17 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ స్పందన తెలియజేస్తున్నారు. వరుడు చేసిన పనిని తెగ ప్రశంసిస్తున్నారు. ఇంత గౌరవప్రదమైన భర్తను పొందిన ఈ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి