Bahubali Kattappa Poster: మహారాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పోస్టర్.. ద్రోహులు అంటూ.. వారి ఫోటోలు!
శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు
మహారాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన.. మరోవైపు తిరుగుబాటు నేతలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు తిరుబాటు ఎమ్మెల్యేలపై మండిపడుతున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో శివసేన రెబల్ ఎమ్మేల్యేలకు వ్యతిరేకంగా పోస్టర్లు, దిష్టిబొమ్మల దగ్ధం లాంటి ఘటనలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పోస్టర్లను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే అనుచరులు సైతం శివసేన నాయకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచిన సీన్ లాంటి పోస్టర్‌ను శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ‘‘గౌహతిలో దాక్కున్న ద్రోహులను.. దేశం మొత్తం చూస్తుంది.. ఇలాంటి వారిని ప్రజలు క్షమించరు.. ’’ అని పెద్ద పెద్ద పదాలతో రాసిన పోస్టర్లు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక తర్వాత, శివసేన సీనియర్ నాయకుడు మరియు క్యాబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు జూన్ 22 నుండి అస్సాం రాజధాని గౌహతిలోని ఒక హోటల్‌లో క్యాంప్ చేస్తున్నారు. తనకు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు మినహా మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. అంతకుముందు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు సూరత్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళానికి బీజేపీయే కారణమని శివసేన మరోసారి నిందించింది. సామ్నాలో రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనలో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనల్లో తమ హస్తం లేదని బీజేపీ చెబుతుండగా, రావ్ సాహెబ్ దాన్వే ప్రకటనతో అంతా తేలిపోయింది. దీనితో పాటు, మహారాష్ట్రను మూడు ముక్కలు చేయడానికి ఢిల్లీలో కూర్చున్న బిజెపి నాయకులు ప్రమాదకరమైన కుట్ర పన్నారని శివసేన సామ్నాలో ఆరోపించింది.
Assam | A poster that reads “Sara desh dekh raha hai, Guwahati mein chhupe gaddaron ko, maaf nahi karegi janta aise farzi makkaron ko” put up by Rashtravadi Yuvak Congress in Guwahati
Rebel Maharashtra MLAs are staying at Radisson Blu hotel in the city. #MaharashtraCrisis pic.twitter.com/FrDpuQMiEZ
— ANI (@ANI) June 28, 2022
ఇదిలా ఉంటే, మరోవైపు మహారాష్ట్రలో రాజకీయాలు గంట గంటకూ మారుతున్నాయి. తాజాగా ప్రతిపక్షనేత దరేకర్ ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. దీనిపై గవర్నర్ కొష్యారి మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నిధులు, జీవో విడుదల పై వివరాలు ఇవ్వాలని లేఖ రాశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి