Sangli Murder Case: ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు..!

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఇటీవల ఇద్దరు అన్నదమ్ముల కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఒకే సారి మృతి చెందడం సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు.

Sangli Murder Case: ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ నిజాలు..!
Sangli Murder Case
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 4:03 PM

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఇటీవల ఇద్దరు అన్నదమ్ముల కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఒకే సారి మృతి చెందడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాకింగ్‌ నిజాలు బయటపెట్టారు. తొమ్మిది మంది మృతి ఆత్మహత్య కాదు.. హత్య అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒక మాంత్రికుడు, అతని సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు దీనిని ఆత్మహత్య కేసుగా పరిగణించారు. కుటుంబ సభ్యుల మృతదేహాలు జూన్ 20 న మహైసాల్ గ్రామంలో కిలోమీటరు దూరంలో ఉన్న ఇద్దరు సోదరుల ఇళ్లలో గుర్తించారు. వారిలో ఒకరు ఉపాధ్యాయుడు, మరొకరు పశువైద్యుడు. ప్రాథమిక విచారణలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావించారు. కానీ, ప్రస్తుత దర్యాప్తులో తేలిన అసలు విషయాలు ఏంటంటే..

కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యుల మరణవార్త దావానంలా వ్యాపించింది. వందలాది మంది ప్రజలు గ్రామంలోని అంబికా నగర్ ప్రాంతంలోని వారి ఇళ్ల వైపు పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సాంగ్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీక్షిత్ కుమార్ గెడం, మహైసాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ బెంద్రే, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. పోలీసు విచారణలో భాగంగా వారిది ఆత్మహత్య కాదు.. హత్య అని తేలిందని స్థానిక ఎస్పీ దీక్షిత్ గేడామ్ తెలిపారు. వారిపై విషప్రయోగం జరిపారని పేర్కొన్నారు.

నిందితులు ధీరజ్ చంద్రకాంత్ సురవశే, అబ్బాస్ మొహ్మద్ అలీ బాగ్వాన్ను ఈ మేరకు అదుపులోకి తీసుకున్నారు. గుప్త నిధి కోసమే నిందితులు వారిని చంపినట్టు తెలుస్తోంది. షోలాపూర్‌కు చెందిన బగ్వాన్, ధీరజ్ సురవాసే ఇద్దరూ జూన్ 19 రాత్రి టీలో విషపూరిత పదార్థాన్ని కలిపి వాన్‌మోర్ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది సభ్యులకు ఇచ్చి చంపినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..