AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonia Gandhi’s PA: సోనియా గాంధీ పీఏ పీపీ మాధవన్‌పై కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం..

జూన్ 25 న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ఆధారంగా జూన్‌ 26 కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

Sonia Gandhi’s PA: సోనియా గాంధీ పీఏ పీపీ మాధవన్‌పై కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు ముమ్మరం..
E Fir
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2022 | 9:23 PM

Share

FIR Against Sonia Gandhi’s PA : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత సహాయకుడు పీపీ మాధవన్‌పై లైంగికదాడి కేసు నమోదైంది..ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అతనిపై లైంగికదాడి కేసు నమోదు చేశారు. లైంగికదాడితో పాటు, క్రిమినల్ బెదిరింపు అభియోగాలు కూడా మోపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు.

జూన్ 25 న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ఆధారంగా జూన్‌ 26 కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. పెళ్లి, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ దళిత మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. అందిన సమాచారం మేరకు…సదరు మహిళ భర్త 2020 లో మరణించాడు. దళిత మహిళ భర్త ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో పనిచేశాడు. భర్త చనిపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామంటూ తనను శారీరకంగా వేధిస్తున్నారని మహిళ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ సోనియా గాంధీ పీఏ పీపీ మాధవన్ ఖండించారు. “ఇది పూర్తిగా నిరాధారం మరియు ఇది ఒక కుట్ర” అని వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత అతను చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి