Health Benefits : పచ్చి టమాటాలతో పిచ్చి లాభాలు.. తెలిస్తే మరింత స్మార్ట్‌గా అవుతారు..!

మార్కెట్లో పచ్చి ట‌మాటాలు తక్కువ ధరకు ఇచ్చిన ఎవరూ కొనటానికి ఇష్టపడరు. కానీ పచ్చి టమోటాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒక్కసారి పచ్చి ట‌మాటా తినడం వల్ల లాభాలు తెలిస్తే

Health Benefits : పచ్చి టమాటాలతో పిచ్చి లాభాలు.. తెలిస్తే మరింత స్మార్ట్‌గా అవుతారు..!
Raw Tomato
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2022 | 9:12 PM

మనలో చాలామంది ట‌మాటాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. టమాట కూర, టమాటా పప్పు అంటే చాలా మందికి ఇష్టం.. అయితే, ఇక్కడ పండు టమాటాలు వాడుతుంటారు. కానీ, పచ్చి టమాటాలను పొరపాటున కూడా వాడరు. మార్కెట్లో పచ్చి ట‌మాటాలు తక్కువ ధరకు ఇచ్చిన ఎవరూ కొనటానికి ఇష్టపడరు. కానీ పచ్చి టమోటాలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఒక్కసారి పచ్చి ట‌మాటా తినడం వల్ల లాభాలు తెలిస్తే ఇకపై తప్పక కొంటారని అంటున్నారు.

పచ్చి టమాటాలలో ఆరోగ్యానికి అవసరమైన అనేక ప్రయోజనాలు దాగున్నాయి. పచ్చి టమాటాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటు ఎక్కువగా ఉండే వారు పచ్చి టమాటాలు తినడం మంచిది. ఎందుకంటే ఇందులో సోడియం తక్కువ మోతాదులో, పోటాషియం అధిక మోతాదులో ఉంటుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పచ్చి టమాటాల్లో పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి మేలు చేకూరుతుంది. ఇంకా రోదనిరోధక శక్తిని పెంచడంతో పాటు..కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పచ్చి టొమాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండి కళ్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. విటమిన్ K పచ్చి టమాటాలో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఉంటే వాటిని తొలగించి.. సాధారణ స్థితికి తీసుకొస్తుంది. తద్వారా స్ట్రోక్స్ వంటి సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు.

పచ్చి టమాటాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల వృద్ధాప్య ప్రభావం తగ్గుతుంది. ఎల్లప్పుడూ.. యవ్వనంగా కనిపిస్తారు. ఆకుపచ్చ టమోటాలలో విటమిన్ సి అధిక మొత్తంలో లభిస్తుంది. దీని వల్ల చర్మ కణాలు ఏర్పడి.. ముడతలు తగ్గుతాయి. అప్పుడు మరింత అందంగా కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!