Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Garlic: క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, మతిమరుపు, బ్లడ్‌ షుగర్‌.. సర్వరోగ నివారిణి నల్ల వెల్లుల్లి!

సాధారణంగా వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి తెలుపు రంగులో ఉంటుంది. ఐతే నలుపు రంగులో ఉండే వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? భారతీయ ఆయుర్వేదంలో నల్ల వెల్లుల్లి..

Black Garlic: క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, మతిమరుపు, బ్లడ్‌ షుగర్‌.. సర్వరోగ నివారిణి నల్ల వెల్లుల్లి!
Black Garlic
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 27, 2022 | 9:09 PM

Health Benefits of Black Garlic: సాధారణంగా వంటల్లో ఉపయోగించే వెల్లుల్లి తెలుపు రంగులో ఉంటుంది. ఐతే నలుపు రంగులో ఉండే వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? భారతీయ ఆయుర్వేదంలో నల్ల వెల్లుల్లి తరచుగా ఉపయోగిస్తారు. వైద్యానికేకాకుండా వంటల్లోనూ ఇది మేటి. నల్ల వెల్లుల్లిలోని ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే దీనిని సూపర్ ఫుడ్‌ అంటారు. పూర్వ కాలంలో ఈజిప్టు దేశంలో ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు నల్ల వెల్లుల్లిని తినేవారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు కూడా నల్ల వెల్లుల్లిని బలవర్ధక ఆహారంగా అందిస్తారు.

నలుపు వెల్లుల్లిని ఎలా తయారు చేస్తారంటే.. తెల్ల వెల్లుల్లి నుంచి నలుపు వెల్లుల్లిని తయారు చేస్తారు. ఇది కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేయబడుతుంది. తగు మోతాదు స్థిర ఉష్ణోగ్రతలో ఎక్కువ సేపు ఉన్న తర్వాత అందులో కిణ్వ ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్రమంగా దీని రంగు నల్లగా మారుతుంది. దాని ఘాటు, వాసన కూడా చాలా తక్కువగా మారిపోతుంది. ఇలా తయారు చేసిన నల్ల వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి.

నల్ల వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు

ఇవి కూడా చదవండి
  • రోజూ ఉదయాన్నే పరగడుపుతో నల్ల వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు. డయేరియాతో బాధపడేవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగుల సమస్య ఉన్నవారికి కూడా నల్ల వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది.
  • నల్ల వెల్లుల్లి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. నల్ల వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
  • నల్ల వెల్లుల్లి మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, హై బీపీని నియంత్రిస్తుంది.
  • నల్ల వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనిలోని అల్లిసిన్ రక్తాన్ని పలుచన చేసి గుండె రక్తం గడ్డకట్టుకుపోకుండా నివారిస్తుంది.
  • బీటా అమిలాయిడ్ అనే ప్రొటీన్ పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ సంక్రమిస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. నల్ల వెల్లుల్లి ఈ ప్రొటీన్ వల్ల మెదడులో కలిగే మంటను తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంటే అల్జీమర్స్ రోగులకు నల్ల వెల్లుల్లి దివౌషదం.
  • నల్ల వెల్లుల్లిలో క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడే అనేక గుణాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలను దీనిలో అధికంగా ఉంటాయి. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా నల్ల వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.