సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న షూటింగ్‌లతో, థియేటర్స్ ఓపెన్ తో ఇండస్ట్రీ మళ్లీకళకలాడుతుంది అనుకునేలోపే వరుస మరణాలు చిత్రసీమ ను శోకసంద్రంలో పడేస్తుంది. తాజాగా ప్రముఖ

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..
Actress Ambika Rao
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 4:40 PM

కరోనా మహమ్మారి కారణంగా చిత్ర సీమ ఎంతోమంది ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న షూటింగ్‌లతో, థియేటర్స్ ఓపెన్ తో ఇండస్ట్రీ మళ్లీకళకలాడుతుంది అనుకునేలోపే వరుస మరణాలు చిత్రసీమ ను శోకసంద్రంలో పడేస్తుంది. తాజాగా ప్రముఖ మలయాళ నటి అంబికా రావు (58) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా ఎర్నాకులం లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం(జూన్ 27) రాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల మలయాళ సినీ ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి లోనైంది. మలయాళ చిత్ర పరిశ్రమలో 2002లో అడుగుపెట్టారు అంబికా రావు.

చలన చిత్ర నిర్మాత బాలచంద్ర మీనన్ ‘కృష్ణ గోపాల కృష్ణ ‘ అనే సినిమాతో అసిస్టెంట్ దర్శకురాలిగా వృత్తిని ప్రారంభించారు. రెండు దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్‌లో మమ్ముట్టి చిత్రం ‘రాజ మాణిక్యం’, ‘తొమ్మనుమ్ మక్కలుమ్’ మరియు పృధ్విరాజ్ యొక్క ‘ పెళ్లి నక్షత్రం’ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. అనంతరం తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. వీటిలో కుంబళంగి నైట్స్‌ ఒకటి. అలాగే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్న ‘కడువా’, టోవినో థామస్‌తో కలిసి ‘వైరస్‌’ సినిమాలో అంబికా నటించారు. కాగా ఆమె మృతి పట్ల టొవినో థామస్ తో పాటు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపం తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి