Nithya Menen: నిత్యా మీనన్‌కి ఏం జరిగింది ?.. నడవలేని స్థితిలో హీరోయిన్..
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు ప్రధాన పాత్రలు
అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది నిత్యా మీనన్ (Nithya Menen).. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడుకు ఆ తర్వాత టాలీవుడ్ వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇష్క్ సినిమాతో కుర్రాళ్ల ఫెవరెట్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత జనతా గ్యారేజ్, అ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, స్కైలాబ్ సినిమాలతో అలరించింది..గతేడాది పవర్ స్టార్ పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీతో మరో హిట్ అందుకుంది. ఇక ఇటీవల ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో న్యాయనిర్ణేతగా కనిపించిన నిత్యా.. తాజాగా నడవలేని స్థితిలో చేతిలో స్టిక్ పట్టుకుని కనిపించి షాకిచ్చింది..
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో మోడ్రన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, మాళవిక నాయర్, సుహాసిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ వెబ్ సిరీస్ జూలై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ వేడుకలో పాల్గొన్న నిత్య .. చేతిలో స్టిక్ పట్టుకుని.. నడవలేని స్థితిలో ఇద్దరు బాడీగార్డ్స్ సాయంతో వచ్చి అందరికీ షాకిచ్చింది.. ఈ సందర్భంగా నిత్య మీనన్ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్ లో నేను ఎల్బో క్రచ్ తో నటించాను.. అయితే నాకు నిజ జీవితంలోనూ అదే జరిగింది.. రెండు రోజుల క్రితం స్టెప్స్ నుంచి స్లిప్ అయి పడిపోయాను.. ఇప్పుడు ఎల్బో క్రచ్ తో ఇబ్బంది పడుతున్నాను..అంటూ చెప్పుకొచ్చారు.