AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu: ఉజ్జయిని మహాకాళి ఉత్సవాలకు వేళాయే.. ఎదుర్కోలు మహోత్సవంతో బోనాలు ప్రారంభం

సికింద్రాబాద్(Secunderabad) ఉజ్జయిని మహంకాళి బోనాలకు ముహూర్తం ఖరారైంది. జులై 3 ముంచి ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో జి.మనోహర్ రెడ్డి తెలిపారు. అమ్మవారి ఘటం ఎదుర్కోలు మహోత్సవంతో ఉత్సవాలు...

Bonalu: ఉజ్జయిని మహాకాళి ఉత్సవాలకు వేళాయే.. ఎదుర్కోలు మహోత్సవంతో బోనాలు ప్రారంభం
Bonalu
Ganesh Mudavath
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 09, 2022 | 5:36 PM

Share

సికింద్రాబాద్(Secunderabad) ఉజ్జయిని మహంకాళి బోనాలకు ముహూర్తం ఖరారైంది. జులై 3 ముంచి ఆషాఢ మాస బోనాల జాతర ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో జి.మనోహర్ రెడ్డి తెలిపారు. అమ్మవారి ఘటం ఎదుర్కోలు మహోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. జులై 17న బోనాలు, 18న రంగం ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణలోనే ఉండడంతో మంత్రి తలసాని(Minister Talasani Srinivas) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో నేరుగా పాల్గొని మొక్కులు చెల్లించలేకపోయే భక్తుల కోసం తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన పోస్టాఫీస్ లతో పాటు సబ్‌ పోస్టు ఆఫీసులు, బ్రాంచి పోస్టు ఆఫీసుల్లో ఈ సేవలను పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 30 నుంచి జులై 27 వరకూ ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. ఆలయంలో పూజలు చేయించి, ఆగస్టు 1 నుంచి చిరునామాకు ప్రసాదాలు పంపిస్తామని పోస్టల్ అధికారులు స్పష్టం చేశారు.

కాగా.. గతేడాది సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఘటోత్సవాలు కర్బలా మైదాన్‌ వద్ద గల మహాకాళి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వీరభద్ర సహిత మహాకాళేశ్వరాలయం(శివాలయం) వద్ద ఘటాన్ని అలంకరించి, మాడవీధుల్లో ఊరేగించి ఆలయంలో ప్రతిష్ఠించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఆలయంలో ఆషాఢ ఉత్సవాల్లో నిత్య హక్కుదారులు ఒక్కరే పాల్గొన్నారు. ఈ ఏడాది ఘటం బస్తీల్లోకి వెళ్లదని, దేవాలయంలోనే ఉంటుందని ఈవో అన్నపూర్ణ తెలిపారు. సికింద్రాబాద్‌ సోమసుందరం వీధిలోని శ్రీదేవి పోచమ్మ ఘటోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ వార్తల కోసం