Andhra Pradesh: ‘నాపై కూడా కుట్రలు చేస్తున్నారు’.. మాజీ మంత్రి తరహాలో ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..!
Andhra Pradesh: అధికార వైసీపీ లీడర్స్ చేస్తున్న కామెంట్స్ ఏపీలో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేస్తోంది. ప్రత్యర్థులపై కాకుండా..
Andhra Pradesh: అధికార వైసీపీ లీడర్స్ చేస్తున్న కామెంట్స్ ఏపీలో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచేస్తోంది. ప్రత్యర్థులపై కాకుండా.. సొంత పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తుండటంతో ఈ చర్చకు కారణమవుతోంది. నిన్నటికి నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించి సంచలానిని తెరలేపగా.. తాగాజా ఆయన బాటలోనే మరో ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలే తనను అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారంటూ చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ప్రెస్‌మీట్ పెట్టిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. సంచలన ఆరోపణలు చేశారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం అంటూనే.. తనపైనా సొంత పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి.
మంగళవారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కోటం రెడ్డి.. ముందుగా బాలినేనికి మద్ధతుగా మాట్లాడారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు విచారకరం అని అన్నారు. తనపని తాను చేసుకుంటూ, తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అని పేర్కొన్నారు. సొంతపార్టీ వ్యక్తులు ద్రోహం చేస్తున్నారని ఆయన బాధపడటం తనకు బాదేసిందన్నారు. బాలినేని లాగే తనపై కూడా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు కోటం రెడ్డి. వైసీపీలో కొంతమంది ముఖ్యనేతలకి, ఎమ్మెల్యేలకి ఇతర నియోజకవర్గాల్లో జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలో చూసుకోకుండా ఇతర నియజకవర్గాల్లో వేలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తరచూ పార్టీలు మారే సీజనల్ నేతలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కోటంరెడ్డి.