AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: నేను బీజేపీ మనిషిని.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

Mohan Babu Comments on BJP: తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని, మోడీ గెలవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకరిని అని మోహన్ బాబు పేర్కొన్నారు.

Mohan Babu: నేను బీజేపీ మనిషిని.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు
Manchu Mohan
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2022 | 1:36 PM

Share

Actor Manchu Mohan Babu on BJP: కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్ మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తిరుపతిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌ పాదయాత్రగా కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలో ఉండాలని, మోడీ గెలవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకరిని అని పేర్కొన్నారు. తాను రియల్‌ హీరోనని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారంటూ మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. కాగా.. మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే కోర్టుకు పాదయాత్ర ద్వారా హాజరయ్యారు.. ఏదైనా కారణం ఉందా అంటూ మీడియా ప్రశ్నించగా. పాదయాత్రగా వచ్చానని ఎవరు చెప్పారంటూ మోహన్ బాబు ప్రశ్నించారు. తాను రియల్‌ హీరోనని.. తనకు చాలామంది అభిమానులు ఉన్నారని వారితో ఆత్మీయంగా మాట్లాడేందుకే నడుచుకుంటూ వచ్చానన్నారు.

మోహన్‌ బాబు, ఆయన తనయులైన సినీ హీరోలు విష్ణు, మనోజ్‌పై 2019 మార్చి 22న కేసు నమోదైంది. విద్యార్థుల ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ కోసం ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యా నికేతన్‌ విద్యార్థులతో కలిసి మోహన్‌ బాబు, విష్ణు, మనోజ్‌లు రోడ్డుపై బైఠాయించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఉల్లంఘిస్తూ ధర్నా చేసినందుకు చంద్రగిరి పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన