AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పెళ్లికి పిలిచి మమ్మల్నే అవమానిస్తావా..? వరుడిపై రూ.50 లక్షల దావా వేసిన స్నేహితులు..

తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్‌ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి స్నేహితుడు.

Viral: పెళ్లికి పిలిచి మమ్మల్నే అవమానిస్తావా..? వరుడిపై రూ.50 లక్షల దావా వేసిన స్నేహితులు..
Haridwar Groom
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2022 | 12:13 PM

Share

Haridwar groom sued by friends for Rs 50 lakh: వివాహ వేడుక అంటేనే బంధువులు, స్నేహితులతో ఎంతో సందడి సందడిగా సాగే కార్యక్రమం. అందుకే వివాహాన్ని చాలామంది ఎంతో స్పెషల్‌గా ప్లాన్‌ చేసుకుంటారు. ఇక్కడ ఓ వరుడు కూడా అలాగే ప్లాన్‌ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్‌ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి స్నేహితుడు. తీరా ఫ్రెండ్స్‌ వచ్చేసరికి వరుడు పెళ్లి మండపానికి వెళ్లిపోయాడు. దాంతో ఆగ్రహించిన మిత్రులు అతనిపై కేసుపెట్టారు.. ఈ విచిత్ర సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ ప్రాంతంలోని బహదూరాబాద్‌లో జరిగింది.

హరిద్వార్‌లోని బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా వివాహానికి బయలుదేరుతున్నామని, స్నేహితులందరూ తప్పక బారాత్‌లో పాల్గొనాలని అతని స్నేహితుడిద్వారా అందరికీ ఇన్విటేషన్లు పంపాడు. అలాగే ఆ సమయానికి అందరం కలుసుకుందామని స్నేహితులకు చెప్పాడు. కాగా, పెళ్లి రోజున స్నేహితులందరు అనుకున్న సమయానికి వరుడు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు.

ఇది తెలిసిన స్నేహితులు పట్టరాని ఆగ్రహంతో వరుడికి ఫోన్‌ చేశారు. అయితే వారు రావడం ఆలస్యమైందని, అందుకే వెళ్లిపోయామని పెళ్లి కుమారుడు ఆరోపించాడు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు. దీంతో వరుడి తీరుపై చంద్రశేఖర్ అనే స్నేహితుడు మండిపడ్డాడు. వెంటనే న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు తమ గౌరవాన్ని దెబ్బతీసినందుకు వరుడిపై 50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. పెళ్లికి ఆహ్వానించిన స్నేహితులు, అతిథులతోపాటు దానికి పురమాయించిన తనను మానసికంగా హింసించినట్లు అందులో ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..