AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soybean Benefits: సోయా ఫుడ్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

కరోనా తర్వాత.. వెంటనే కోలుకోవడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఉత్తమమైన ప్రోటీన్ కోసం మీరు ఆహారంలో సోయాబీన్స్ నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు..

Soybean Benefits: సోయా ఫుడ్‌తో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Soybean Benefits
Shaik Madar Saheb
|

Updated on: Jun 28, 2022 | 11:40 AM

Share

Health benefits of Soybean: శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపం ఉంటే రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ త్వరగా ప్రభావితమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో శరీరం దృఢంగా ఉండటానికి విటమిన్లతో పాటు, ప్రోటీన్ కూడా అవసరం. శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిచేయడానికి ప్రోటీన్ సహాయపడుతుంది. కరోనా తర్వాత.. వెంటనే కోలుకోవడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఉత్తమమైన ప్రోటీన్ కోసం మీరు ఆహారంలో సోయాబీన్స్ నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు..

సోయాబీన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సోయాబీన్ ఉత్పత్తులలో తగినంత మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్. అందుకే ఇది ఇతర ప్రోటీన్ల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని సోయా ఫుడ్ ద్వారా సులభంగా తీర్చుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.

శాఖాహారులకు సోయాబీన్..

ఇవి కూడా చదవండి

శాఖాహారులకు సోయాబీన్ మంచిగా ప్రొటిన్‌ను అందిస్తుంది. సోయాబీన్ నుంచి తయారైన ఉత్పత్తులు ప్రోటీన్‌కు ఉత్తమ మూలం. సోయాబీన్ పాలు, సోయాబీన్ నూనె, సోయాబీన్ పదార్థాలు, సోయాబీన్ పొడిని ఇలా అనేక రకాలైన ఆహారాలను తీసుకోవచ్చు.

సోయాబీన్ ప్రయోజనాలు

  • సోయాబీన్ ప్రోటీన్, ఫైబర్‌కు ఉత్తమ మూలం.
  • ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల లోపాన్ని తీర్చడానికి సోయాబీన్స్ కూడా తినవచ్చు.
  • సోయాబీన్ లాక్టోస్, గ్లూటెన్ రహిత ప్రోటీన్.
  • సోయాబీన్‌లో సంతృప్త కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.

సోయాబీన్స్‌ను అనేక విధాలుగా తినవచ్చు. సోయా గింజల నుంచి.. పదార్థాల వరకు అన్నింటిని ఆహారంలో తీసుకోవచ్చు. సోయాబీన్‌ను అల్పాహారం లేదా ఆహారంలో ఉపయోగించవచ్చు. అందుకే సోయా ఫుడ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు
వికెట్ల వేటలో విఫలమవుతున్న స్టార్ బౌలర్లు