Viral Video: ఈ చేప మామూలుది కాదుగా.. ఏకంగా భారీ పక్షిపైనే ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే
సముద్రంలో ఎన్నో రహస్యలు, వింతలు దాగి ఉంటాయని అంతా అంటుంటారు. సముద్రానికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
Viral Video: సముద్రంలో ఎన్నో రహస్యలు, వింతలు దాగి ఉంటాయని అంతా అంటుంటారు. సముద్రానికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సముద్రంలో జీవించే జీవుల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ చేపకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చేపలు చిన్న చిన్న జీవులను నాచు, పీచూ లాంటి తింటూ ఉంటాయి. కానీ ఈ వీడియోలో చేప మాత్రం వెరైటీగా ట్రై చేసి వైరల్ అయ్యింది. ఒక చేప ఏకంగా పక్షినే మింగేడానికి ట్రై చేసింది. అదికూడా చిన్న పక్షిని కదా ఆ చేప అంత ఉన్న పక్షిపై అటాక్ చేసింది.
ఒక పక్షి సముద్రం మీద తిరుగుతుండటం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అదే సమయంలో సడన్ గా ఓ చేప నీళ్లలోనుంచి ఎగిరి ఆ పక్షిని మింగడానికి ట్రై చేసింది. అంతే కాదు. ఆ పక్షిని అమాంతం నీళ్లలోకి లాక్కెళ్లిపోయింది. నీటిలో మునగడంతో ఆ పక్షి చనిపోయినట్టు తెలుస్తోంది. పక్షి దాని నుండి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చేసేసింది చేప. ఈ భయంకరమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అనేక కామెంట్‌లు చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకు 108k వ్యూస్ అలాగే భారీగా లైక్‌లు వచ్చాయి.
View this post on Instagram