AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter Results 2022: ఇంటర్‌ ఫలితాలపై టెన్షన్‌ అక్కర్లేదు.. విద్యార్ధుల కోసం ప్రత్యేక కౌన్సిలర్ల ఏర్పాటు..

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల సందర్భంగా విద్యార్ధుల్లో తలెత్తే ఒత్తిడి, పరీక్షల భయాన్ని దూరం చేసేందుకు స్టూడెంట్‌ కౌన్సెలర్లను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు క్లినికల్ సైకాలజిస్టుల నంబర్లను ఏర్పాటు చేసినట్లు బోర్డు..

TS Inter Results 2022: ఇంటర్‌ ఫలితాలపై టెన్షన్‌ అక్కర్లేదు.. విద్యార్ధుల కోసం ప్రత్యేక కౌన్సిలర్ల ఏర్పాటు..
Tsbie
Srilakshmi C
| Edited By: Janardhan Veluru|

Updated on: Jun 28, 2022 | 6:01 PM

Share

Mental health support to students to overcome exam fear or anxiety: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను మంగళవారం (జూన్‌ 28) ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు, జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్లు ఇంటర్‌ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in లేదా https://examresults.ts.nic.in లేదా https://resutls.cgg.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయ్యి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు సూచించింది. ఫలితాలను తనిఖీ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే helpdesk-ie@telangana.gov.inకు మెయిల్‌ లేదా 040-24601010 / 040-24655027 నంబర్లకు ఫోన్‌ చేసి సందేహ నివృతి చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు తెల్పింది. అలాగే విద్యార్ధుల్లో ఒత్తిడి, పరీక్షల భయాన్ని దూరం చేసేందుకు స్టూడెంట్‌ కౌన్సెలర్లను కూడా ఏర్పాటు చేసింది. విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు 2500 టోల్‌ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు బోర్డు పేర్కొంది. అంతేకాకుండా విద్యార్ధుల్లో తలెత్తే ఒత్తిడి, స్ట్రెయిన్‌, టెన్షన్, యాంగ్జైటీ, ఆందోళన ఇతర సమస్యల నివారణకు క్లినికల్‌ సైకాలజిస్టులకు సంబంధించిన ఫోన్‌ నంబర్లతోపాటు, టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేసింది. విద్యార్ధులు కింది లిస్టులో ఇచ్చిన సైకాలజిస్టులకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

క్లినికల్ సైకాలజిస్టుల పేర్లు- ఫోన్‌ నంబర్లు

  • డా అనిత-949129159
  • డా మజీర్‌ అలీ-9491265299
  • డా రజిని-9491273876
  • డా జవహర్‌లాల్‌నెహ్రూ-9491307681
  • ఎస్‌ శ్రీలత-9491321197
  • శైలజ పిసపాటి-9491338909
  • అనుపమ గుట్టిందేవి-9491265503
  • సైయద్‌ అల్తఫ్‌ హుస్సేన్-9491279203
  • సరోజ-9491296096
  • టోల్‌ఫ్రీ నెంబర్-18005999333

ఇంటర్ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.