Viral Photo: మస్త్ పరేషాన్ చేస్తది.. ఈ ఫోటోలోని కుక్కను గుర్తిస్తే మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే!

మీకు సవాళ్లంటే ఇష్టమా..? ఎప్పుడూ ఏదొక పజిల్ సాల్వ్ చేస్తుంటారు. అయితే ఇది మీకోసమే.. కొంచెం కష్టమైన పజిల్.. ట్రై చేయండి.. నిశితంగా చూస్తే..

Viral Photo: మస్త్ పరేషాన్ చేస్తది.. ఈ ఫోటోలోని కుక్కను గుర్తిస్తే మీ కళ్లలో మ్యాజిక్ ఉన్నట్లే!
Dog Picture
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2022 | 1:44 PM

ఆ రోజు రెస్క్యూ సిబ్బంది 50 అడుగుల ఎత్తయిన కొండపై నుంచి పడిపోయిన రోక్సీ అనే కుక్క కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. ప్రొద్దున్న నుంచి ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ఎక్కడా కూడా కుక్క జాడ కనిపించడం లేదు. చీకటి పడుతోంది. ఇక వెతికింది చాలు.. అని వెనుదిరిగిన రెస్క్యూ సిబ్బందిలో ఒకరికి ఓ పెద్ద రాయి ప్రక్కన రోక్సీ కనిపించింది. అది చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడున్న రాళ్ల రంగు.. కుక్క రంగు ఒకటే కావడం.. రాళ్లలో కుక్క ఇమిడిపోవడంతో రెస్క్యూ సిబ్బందికి దాన్ని కనిపెట్టడం కష్టమైంది. కానీ ఇక్కడ జరిగిన మంచి విషయమేంటంటే.. ఎత్తయిన కొండపై నుంచి కిందపడినా రోక్సీ చిన్న చిన్న గాయాలతో బయటపడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.. చూశారా.. పెద్ద పెద్ద రాళ్లు.. పక్కనే సముద్రం కనిపిస్తోంది కదూ.. అందులోనే ఓ కుక్క కూడా ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కష్టమే. మరి మీరేమంటారు. ఒకసారి పజిల్ సాల్వ్ చేసేందుకు ట్రై చేయండి. మీరూ కుక్కను కనిపెట్టడం కష్టంగా అనిపిస్తే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.

సమాధానం: ఫోటోలో కనిపించే పెద్ద రాయి దగ్గర జూమ్ చేస్తే కుక్క కనిపిస్తది..