CM Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ పెన్షన్‌ పథకాలను విడుదల చేస్తున్నారు..

CM Jagan: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 29, 2022 | 1:48 PM

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ పెన్షన్‌ పథకాలను విడుదల చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో మరో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. తర్వాత డిసెంబర్‌ 1 నుంచి ఈ సంవత్సరం జూన్‌ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్‌ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్‌కు అర్హులని తేల్చింది జగన్‌ ప్రభుత్వం. కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

అర్హులైన వారికి పెన్షన్‌ అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్‌ ఆర్‌ పింఛన్‌ కానుకను అమలు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?