AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న అల్లూరి కాంస్య విగ్రహం ఇదే.. దాని ప్రత్యేకతలను తెలుసుకోండి..

‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరం (Bhimavaram) లో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

PM Modi: ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న అల్లూరి కాంస్య విగ్రహం ఇదే.. దాని ప్రత్యేకతలను తెలుసుకోండి..
Alluri Sitarama Raju Birth
Shaik Madar Saheb
|

Updated on: Jun 29, 2022 | 2:03 PM

Share

Alluri Sitarama Raju birth anniversary: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరం (Bhimavaram) లో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకలలో భాగంగా భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. 15 టన్నుల బరువున్న ఈ కాంస్య విగ్రహాన్ని పట్టణంలోని 34వ వార్డు ఏఎస్‌ఆర్‌ నగర్‌లోని మునిసిపల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్నారు.

దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్‌ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్‌ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు మెగాస్టార్‌ చిరంజీవికి కూడా భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..