AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR Shatha Jayanthi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వెబ్ సైట్ ప్రారంభం.. భారతరత్న కోసం డిజిటల్ సంతకాల సేకరణ

హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం ( www.100yearsofntr.com) వెబ్ సైట్ ను తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

NTR Shatha Jayanthi: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వెబ్ సైట్ ప్రారంభం.. భారతరత్న కోసం డిజిటల్ సంతకాల సేకరణ
Chandrababu
Surya Kala
|

Updated on: Jun 29, 2022 | 12:04 PM

Share

NTR Shatha Jayanti Utsavalu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను దేశ విదేశాల్లోని అన్నగారి అభిమానులు, నేతలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అసోసియేషన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం అనే సైట్ ను రూపొందించింది. తాజాగా హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్ డాట్ కాం ( www.100yearsofntr.com) వెబ్ సైట్ ను తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజల చేత డిజిటల్ సంతకాల సేకరణ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు మీద ఒక అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించి, ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యులకు అభినందనలు తెలిపారు. ఇంతటి కార్యక్రమాన్ని ఎంతో అంకిత భావంతో నిర్వహించడం వారికి ఎన్టీఆర్ మీద వున్న అభిమానానికి నిదర్శనమన్నారు. తెలుగు ప్రజల శక్తి, యుక్తి తెలుగు తేజం, ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ రేపటి తరమే కాదు, తరతరాలు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు అని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవిప్రసాద్, సెక్రటరీ తుమ్మల రమేష్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!