Andhra Pradesh: జంగారెడ్డిగూడెంలో విషాదం.. పొలానికి పాల కోసం వెళ్తే అన్నదమ్ముల ప్రాణమే పోయింది

పొలం వద్ద ఉన్న గేదేల నుంచి పాలు తీసుకొచ్చేందుకు అన్నదమ్ములు 19 ఏళ్ల నాగేంద్ర, 17 ఏళ్ల ఫణీంద్ర బైక్‌పై వెళ్లారు. అయితే, దారిలో తెగిపడిన విద్యుత్‌ తీగలు గమనించలేదు

Andhra Pradesh: జంగారెడ్డిగూడెంలో విషాదం.. పొలానికి పాల కోసం వెళ్తే అన్నదమ్ముల ప్రాణమే పోయింది
Two Men Dead In Wgdt
Follow us
Surya Kala

|

Updated on: Jun 24, 2022 | 2:25 PM

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో అన్నదమ్ములిద్దరూ దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఉదయమే పాలకోసం వెళ్లి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పొలం వద్ద ఉన్న గేదేల నుంచి పాలు తీసుకొచ్చేందుకు అన్నదమ్ములు 19 ఏళ్ల నాగేంద్ర, 17 ఏళ్ల ఫణీంద్ర బైక్‌పై వెళ్లారు. అయితే, దారిలో తెగిపడిన విద్యుత్‌ తీగలు గమనించలేదు. దీంతో వారికి వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి వచ్చి ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించడంతో స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..