AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జఫ్రీన్‌లను ఘనంగా సత్కరించిన సీఎం జగన్‌.. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జఫ్రిన్‌లు భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన బ్యాడ్మింటన్ ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం జగన్‌ను కలిశారు.

AP CM Jagan: కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జఫ్రీన్‌లను ఘనంగా సత్కరించిన సీఎం జగన్‌.. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా..
Ap Cm Ys Jagan
Basha Shek
|

Updated on: Jun 24, 2022 | 2:04 PM

Share

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జఫ్రిన్‌లు భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన బ్యాడ్మింటన్ ప్రపంచ 11వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్.. సీఎం జగన్‌ను కలిశారు. ఏపీ శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నేతృత్వంలో సీఎం జగన్‌తో భేటీ అయిన కిడాంబి.. దాదాపు గంట పాటు సీఎం జగన్‌తో చర్చించారు. కాగా ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ను భారత్ గెల్చుకోవడంలో కీలక పాత్ర పోషించాడు కిడాంబి శ్రీకాంత్‌. అలాగే డెఫిలింపిక్స్‌–2022 పోటీల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జఫ్రిన్‌ కాంస్య పతకం సాధించింది. ఈక్రమంలో అంతర్జాతీయ క్రీడా వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్ఠను వెలుగెత్తిచాటడంపై శ్రీకాంత్‌, జఫ్రిన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు సీఎం వైఎస్‌ జగన్‌. వారిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం తరపున వీరికి అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులను ఆదేశించారు.

కాగా షేక్‌ జఫ్రిన్‌ విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందన్న సీఎం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్న సీఎంఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున సీఎం వైఎస్‌ జగన్‌కు బ్యాడ్మింటన్‌ కిట్‌ అందజేశారు ఏపీబీఏ ప్రెసిడెంట్‌ ముక్కాల ద్వారకానాథ్‌. ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ, షేక్‌ జాఫ్రిన్‌ తండ్రి షేక్‌ జకీర్‌ అహ్మద్, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్, శాప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇద్దరు చిన్నారులను గొంతు కోసి హత్య.. తర్వాత తల్లి ఏం చేసిందంటే
ఇద్దరు చిన్నారులను గొంతు కోసి హత్య.. తర్వాత తల్లి ఏం చేసిందంటే
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి