Andhra Pradesh: 2,114 మున్సిపల్ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న 2,114 మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన పాలన, పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ శుక్రవారం (జూన్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో హై స్కూళ్లు 345, ప్రాథమికోన్నత పాఠశాలలు..
AP Muncial school teacher vacancies: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనున్న 2,114 మున్సిపల్ పాఠశాలకు సంబంధించిన పాలన, పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వ శుక్రవారం (జూన్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. వీటిల్లో హై స్కూళ్లు 345, ప్రాథమికోన్నత పాఠశాలలు 149, ప్రాథమిక పాఠశాలలు 1620 ఉన్నాయి. ఇకపై ఈ పాఠశాలలన్నీ ఏపీ విద్యాశాఖ పరిధిలో కొనసాగనున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కేవలం 59 చోట్ల మాత్రమే మున్సిపల్ పాఠశాలలు ఉంటాయి. వీటికి మొత్తం 13,948 టీచర్ పోస్టులను మంజూరు చేశారు. ఈ పోస్టుల్లో ప్రస్తుతం 12,006ల మంది టీచర్లుగా కొనసాగుతున్నారు. మిగిలిన1942 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ తెల్పింది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మున్సిపల్ స్కూళ్లను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసినట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే తాజా మార్పుతో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. విలీనం చేసిన మున్సిపల్ స్కూళ్లలో ఇక మీదట జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధి విధానాలనే అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది. ఐతే ఆయా మున్సిపల్ పాఠశాలల ఆస్తులు మాత్రం మున్సిపల్ శాఖ ఆధీనంలోనే కొనసాగుతాయని ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.