Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Agnipath Scheme: ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీర్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. నెల తర్వాత ఇదే రోజున..

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' తొలి ఐఏఎఫ్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (జూన్‌ 24) నుంచి ప్రారంభమయ్యింది. అగ్నివీర్‌ మొదటి బ్యాచ్‌ ఎంపికకు..

Agnipath Scheme: ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీర్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. నెల తర్వాత ఇదే రోజున..
Iaf Agniveers
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 24, 2022 | 12:01 PM

IAF Agniveer recruitment Notification 2022: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ తొలి ఐఏఎఫ్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం (జూన్‌ 24) నుంచి ప్రారంభమయ్యింది. అగ్నివీర్‌ మొదటి బ్యాచ్‌ ఎంపికకు నేటి నుంచి సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే జులై 24న నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ నాటికి ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని, డిసెంబర్‌ 30 నుంచి ట్రైనింగ్‌ ప్రారంభమవుతుందని ఎయిర్ మార్షల్‌ ఎస్కే ఝా జూన్‌ 19న జరిగిన త్రివిధ దళాధిపతుల మీడియా సమావేశంలో తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులు ఎయిర్ ఫోర్స్‌ యాక్ట్‌ 1950 కింద నాలుగేళ్లపాటు అగ్నివీరులుగా కొనసాగుతారని ఆయన అన్నారు.

రెండు ఫేజుల్లో ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీరుల నియామకం.. స్పెషల్‌ ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యులు, సాంకేతికత ఆధారంగా గుర్తింపు పొందిన ఎన్‌ఎస్‌క్యూఎఫ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ వంటి సంస్థల సహకారంతో దేశ నలుమూలల నుంచి అభ్యర్ధులను అగ్నివీరులుగా ఎంపిక చేస్తామని అన్నారు. ఐఏఎఫ్‌ అగ్నివీరులకు ప్రత్యేక ర్యాంక్‌ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఉన్న ర్యాంకుకు అది భిన్నంగా ఉంటుందని ఎస్కే ఝా తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అభ్యర్ధులను తీసుకునేటప్పడు వారి తల్లిదండ్రలు లేదా సంరక్షకులు ఎన్‌రోల్‌మెంట్‌ ఫాంపై సంతకాలు చేయవల్సి ఉంటుంది. నియామక ప్రక్రియ మొత్తం రెండు దశల్లో కొనసాగుతుంది. ఫేజ్‌-1లో అర్హత సాధించిన వారు ఫేజ్‌-2కి ఎంపిక అవుతారని ఎస్కే ఝా పేర్కొన్నారు.

జూన్‌ 25న నేవీ అగ్నివీర్‌ నోటిఫికేషన్ కాగా ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నివీరుల నియామకాలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అర్హతలు, పరీక్ష ఫీజు, వయోపరిమితి, వైద్య ప్రమాణాలు, నియమ నిబంధనలను సంబంధించిన పూర్తి సమాచారాన్ని సవివరంగా తెల్పింది. నేవీ నియామకాలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ జూన్‌ 25న విడుదలవుతుందని వైస్‌ అడ్మిరల్‌ దినేష్‌ త్రిపాఠి అన్నారు. నేవీ అగ్నివీరులకు నవంబర్‌ 21 నుంచి ట్రైనింగ్‌ ప్రారంభమవుతుంది. ఈ నియామకాలకు స్త్రీ, పురుష అభ్యర్ధులందరూ అర్హులే. మహిళా అగ్నివీరులు కూడా వార్‌షిప్‌లలో పాల్గొనవచ్చని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

కొనసాగుతున్న నిరసనలు.. కాగా అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి దేశ వ్యప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యార్ధులు వేల సంఖ్యలో ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతూనే ఉన్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ కేంద్రం వెనకడుకు వేయకుండా త్రివిధ దళాల్లో అగ్నివీరుల నియామకాలకు ఒకదాని తర్వాత మరొకటిగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.