AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: డబ్ల్యూహెచ్‌ఎన్‌ హెచ్చరిక! మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటన.. వ్యాప్తి అడ్డుకోకుంటే లక్షల్లో మరణాలు..

మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మంకీపాక్స్‌ కట్టడికి ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే లక్షల మంది దీని భారీన పడి, మృతి చెందే అవకాశం ఉంది. అనేక మంది అంధులుగా, వికలాంగులుగా మారే అవకాశం: డబ్ల్యూహెచ్‌ఎన్‌

Monkeypox: డబ్ల్యూహెచ్‌ఎన్‌ హెచ్చరిక! మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటన.. వ్యాప్తి అడ్డుకోకుంటే లక్షల్లో మరణాలు..
Monkeypox Pandemic
Srilakshmi C
|

Updated on: Jun 24, 2022 | 10:09 AM

Share

WHN Declares Monkeypox A Public Health Emergency: కోవిడ్‌ మహమ్మారి ఓ వైపు దూసుకొస్తుంటే.. మరో వైపు మంకీపాక్స్ చాప కింద నీరులా మెల్లమెల్లగా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాల్లో మంకీపాక్స్ విలయతాండవం చేస్తోంది. ఆయా దేశాల్లో ఇప్పటి వరకు 3,417 మంకీపాక్స్ (Monkeypox) కేసులు నమోదయ్యాయి. వేగంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా వరల్డ్ హెల్త్ నెట్‌వర్క్ (WHN) మంకీపాక్స్‌ను మహమ్మారిగా పేర్కొంటూ గురువారం (జూన్‌ 23) ప్రకటించింది. మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మంకీపాక్స్‌ కట్టడికి ఆచరణాత్మక చర్యలు తీసుకోకపోతే లక్షల మంది దీని భారీన పడి మృతి చెందే అవకాశం ఉంది. ఇది సోకడం వల్ల అనేక మంది అంధులుగా, వికలాంగులుగా మారే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఎన్‌  హెచ్చరికలు జారీ చేసింది.

మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తికి ముందస్తు చర్యలు అవసరం: డబ్ల్యూహెచ్‌ఎన్‌ మంకీపాక్స్‌ నివారణ చర్యలకు పూనుకోకపోతే, వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదని తెల్పింది. ప్రపంచదేశాల సమిష్టి కృషితో మంకీపాక్స్‌ వల్ల తలెత్తబోయే ప్రమాదాన్ని నివారించగలుగుతామని, అధిక వ్యాప్తి వరకు వేచి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అందుకే దీనిని పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఎన్‌ వెల్లడించింది. ‘తక్కువ కేసులు ఉన్నప్పుడే నిర్థారణ పరీక్షలు, క్వారంటైన్‌లో ఉంచటం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివి చేపట్టాలి. తద్వారా పరిణాలు తీవ్రరూపం దాల్చకుండా నిరోధించవచ్చు. లేదంటే విస్తృత స్థాయిలో వ్యాప్తికి దారి తీస్తుందని’ అని న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ సిస్టమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రెసిడెంట్, డబ్ల్యూహెచ్‌ఎన్‌ కో-ఫౌండర్‌ యనీర్ బార్-యామ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

చరిత్రలో గుర్తుండిపోయే గుణపాఠం..కరోనా! 2020 జనవరిలో కరోనా వ్యాపించినప్పుడు ఆలస్యంగా చర్యలు తీసుకోవడం వల్ల లక్షల ప్రాణాలు పోయాయి. కరోనా చరిత్రలో గుర్తిండిపోయే గుణపాఠం నేర్పింది. వైరస్‌ వ్యాప్తిని మొదటి 18 నెలల్లోనే నివారించాలి. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. నిజానికి మంకీపాక్స్‌ నివారణ కరోనా కంటే సులువు. మంకీపాక్స్, స్మాల్‌పాక్స్‌ (మశూచి)లకు చెందని వైరస్‌లు.. ‘ఆర్థోపాక్స్ వైరస్’ అనే ఒకే వైరస్‌ కుటుంబానికి చెందినవి. ఇది ప్రజలకు సులువుగా వ్యాపించే వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది ఆఫ్రికాలో ఎక్కువగా ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. ఐతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో (Western countries) వ్యాపిస్తోంది.

మంకీపాక్స్‌ లక్షణాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జ్వరం, దద్దుర్లు, శరీరంపై నీటి గుల్లల మాదిరి ఏర్పడతాయి. ఇవే మంకీపాక్స్ సాధారణ లక్షణాలు. మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా 2 నుంచి 4 వారాల వరకు వేధిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యాక్తులు తాకిన వస్తువులను తాకినా, వారిని నేరుగా ముట్టుకున్నా వ్యాపించే అంటువ్యాధి. తొలుత వెలుగు చూసిన కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కులు లేదా పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి కనిపించింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి.