NCPOR Recruitment 2022: రూ.68,876ల జీతంతో.. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెందిన గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ (NCPOR).. ఒప్పంద ప్రాతిపదికన వెహికల్ మెకానిక్, వెహికిల్ ఎలక్ట్రీషియన్, జనరేటర్ మెకానిక్ తదితర (Vehicle Mechanic Posts) పోస్టుల..
NCPOR Goa Vehicle Mechanic Recruitment 2022: భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెందిన గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ (NCPOR).. ఒప్పంద ప్రాతిపదికన వెహికల్ మెకానిక్, వెహికిల్ ఎలక్ట్రీషియన్, జనరేటర్ మెకానిక్ తదితర (Vehicle Mechanic Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 31
పోస్టుల వివరాలు: వెహికిల్ మెకానిక్, వెహికిల్ ఎలక్ట్రీషియన్, జనరేటర్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్లు, బుక్‌కీపింగ్ స్టాఫ్, కుక్ తదితర పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.51,657ల నుంచి రూ.68,876ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా/నర్సింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Ministry of Earth Sciences, Prithvi Bhawan, IMD Campus, Opp. India Habitat Centre, Lodhi Road, New Delhi –110 003.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022. జులై 19, 20, 21, 22 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.