APVVP Chittoor Recruitment 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో చిత్తురు జిల్లాలో ఉద్యోగాలు..రాత పరీక్షలేకుండానే..
APVVP Chittoor Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Chittoor District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్ తదితర (Post mortem Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల […]
APVVP Chittoor Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Chittoor District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆడియోమెట్రీషియన్ తదితర (Post mortem Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 13
పోస్టుల వివరాలు:
- పోస్ట్‌మార్టం అసిస్టెంట్ పోస్టులు: 1
- ఆడియోమెట్రీషియన్ పోస్టులు: 4
- ప్లంబర్ పోస్టులు: 5
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 3
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, బీఎస్సీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), Chittoor District, AP.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ.500
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ.300
- వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 29, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.