Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 17వేలకు పైగా పాజిటివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..

India Corona: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. రోజుకు వేలాది మందిని తన బాధితులుగా మార్చుకుంటోంది. బుధవారం సుమారు 13 వేల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. గురువారం (జూన్‌ 23) ఏకంగా 17,336 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

Coronavirus: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులోనే 17వేలకు పైగా పాజిటివ్‌ కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..
India Corona
Follow us

|

Updated on: Jun 24, 2022 | 10:26 AM

India Corona: దేశంలో కరోనా వైరస్‌ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. రోజుకు వేలాది మందిని తన బాధితులుగా మార్చుకుంటోంది. బుధవారం సుమారు 13 వేల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. గురువారం (జూన్‌ 23) ఏకంగా 17,336 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్‌ విడుదల చేసింది. కాగా సుమారు నాలుగు నెలల తర్వాత రోజువారీ కేసులు 17వేలు దాటడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. నిన్న వైరస్ కారణంగా మరో 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు 5,24,954 మంది మృతిచెందారు. కాగా గడచిన 24 గంటల్లో 13,029 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

ఆ రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్..

ఇవి కూడా చదవండి

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 5, 218 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కేరళలో 3890 కేసులు, ఢిల్లీలో 1934, తమిళనాడులో 1063, హర్యానాలో 872, కర్ణాటకలో 858 కేసుల చొప్పున నమోదయ్యాయి. కాగా రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగుతుండటంతో యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 88, 284 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాటివిటీ 4.32 శాతానికి, వీక్లీ పాజిటివిటీ రేటు 3.07 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.20 శాతం, రికరీ రేటు 98.59 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇక కరోనా కట్టడికి దేశంలో ఇప్పటివరకు 196.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని సెంట్రల్‌ హెల్త్‌ మినిస్ట్రీ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..