AP TET: ప్రైవేట్ టీచర్లకూ టెట్ ఉండాల్సిందే.. ఇప్పుడు పని చేస్తున్న వారూ అర్హత సాధించాల్సిందే.. ఆదేశాలు జారీ
ప్రైవేటు టీచర్ల(Private Teachers) విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్కూళ్లల్లో పని చేసే ఉపాధ్యాయులకు టెట్(TET) ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు....
ప్రైవేటు టీచర్ల(Private Teachers) విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్కూళ్లల్లో పని చేసే ఉపాధ్యాయులకు టెట్(TET) ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధించిన మెమోను ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇప్పటికే పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా టెట్ లో అర్హత సాధించాల్సిందేనని ఆదేశాల్లో స్పష్టం చేశారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు, అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు కూడా టెట్‌లో అర్హత సాధించాలని పేర్కొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డీఎస్సీకి సంబంధించి తొలి అడుగుపడింది. చాలా రోజుల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
టెట్ ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్, ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్‌లైన్ పరీక్ష సూచనలు ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే టెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.